కోవిడ్ బారిన పడ్డాక వచ్చే బ్రెయిన్ స్ట్రోక్ కు ఇలా చెక్ పెట్టొచ్చట..

కోవిడ్ ఇతర వ్యాధులున్న వారినే కాదు..

  • Written By:
  • Publish Date - October 31, 2021 / 01:00 PM IST

కోవిడ్ ఇతర వ్యాధులున్న వారినే కాదు.. మామూలు వాళ్లనూ ముప్పతిప్పలు పెడుతోంది. ఏ జబ్బులైనా కోవిడ్ సోకని వారిపై ఒకలా.. కోవిడ్ బారిన పడ్డ వారిలో మరోలా ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. ముఖ్యంగా బ్రెయిన్ స్ట్రోక్ గురించి చెప్పుకుంటే.. మామూలు వాళ్లకు బ్రెయిన్ స్ట్రోక్ వస్తే 66శాతం రికవరీ ఉంటుండగా.. అదే కోవిడ్ బారిన పడిన వారికి 34 శాతం మాత్రమే ఉందని ఎయిమ్స్ కు చెందిన న్యూరోసర్జరీ డిపార్ట్ మెంటుకు చెందిన నిపుణులు చెబుతున్నారు.
సెకండ్ వేవ్ లో వెంటిలేటర్, ఐసీయూలో ఉన్నవారికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్లను అబ్జర్వ్ చేసినపుడు వాళ్లలో ఈ రికవరీ శాతం ఉందని నిపుణులు చెప్పారు. అయితే ఆ స్ట్రోక్ కోవిడ్ వల్లే వచ్చిందని చెప్పలేకపోయినా..కోవిడ్ బారిన పడిన వారికి మాత్రం ఈ రికవరీ రేటు ఉందని తేలింది. డాక్టర్ రోహిత్ భాటియా చెప్పిన దాని ప్రకారం.. 18 సిటీలలో వచ్చిన రివ్యూ లో కోవిడ్ 19 బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినట్లు ఇన్ఫమ్లేటరీ మార్కర్స్ సైజ్.. మామూలు వాళ్లకంటే కోవిడ్ వచ్చిన వాళ్లలో పెద్దగా ఉన్నట్లు గుర్తించామన్నారు. దీని వల్ల వీరికి ట్రీట్ మెంట్ ఇవ్వడం చాలా కష్టం అవుతుందని అన్నారు.

బ్రెయిన్ స్ట్రోక్ సీనియర్ సిటిజన్స్ కే కాదు..యంగ్ పీపుల్ జీవితాలను తలకిందులు చేసిందని ఎయిమ్స్ లో మరో డాక్టర్ పద్మా శ్రీవాత్సవ చెప్పారు. ఇలాంటి వారికి వచ్చే బ్రెయిన్ స్ట్రోక్ కు చెక్ పెట్టడానికి ఎయిమ్స్ తాజాగా స్మార్ట్ ఇండియా అప్లికేషన్ యాప్ లాంచ్ చేసింది. దీనిద్వారా తీవ్రమైన స్ట్రోక్ లక్షణాలను గుర్తించవచ్చని అన్నారు. ఈ యాప్ లో స్ట్రోక్ ప్యాకేజీ కూడా వస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. ఈ యాప్ లో అన్ని మెడికల్ కాలేజీల కోసం ఎడ్యుకేషన్ మాడ్యూల్స్ , కేర్ న్యూరో అసిస్టింగ్ డివైజ్ లు కూడా ఉంటాయి. అందరికీ అందుబాటులో ఉండేలా వాళ్ల స్తోమతకు తగ్గట్లుగా ఉండేలా దీనిని డిజైన్ చేశారు. దీనివల్ల జిల్లాలలో ఉంటున్న డాక్టర్లకు పనిని కల్పించడంతో పాటు.. అందరికీ సమయానికి వైద్యం అందేలా అవుతుందని అన్నారు. దీనివల్ల బ్రెయిన్ స్ట్రోక్ వంటి ఎమర్జెన్సీ టైమ్ లో హాస్పిటల్స్ కు తీసుకెళ్లే అవకాశం ఉంటుందని చెప్పారు.