Site icon HashtagU Telugu

Coronavirus Fourth Wave: క‌రోనా ఫోర్త్ వేవ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్..!

Corona Fourth Wave India

Corona Fourth Wave India

ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తుంది. ఈ క్ర‌మంలో కేంద్ర ప్ర‌భుత్వం క‌రోనా ఫోర్త్ వేవ్ పట్ల అప్రమత్తమైంది. ఈనేప‌ధ్యంలో ఇండియాలో నాలుగో వేవ్ కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంటుందన్న అంచనాతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. దీంతో తాజా దేశంలోని అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది.

దేశంలో కొద్ది రోజులుగా క‌రోనా కేసులు భారీగా త‌గ్గుముఖం ప‌ట్టాయి. దీంతో కరోనా మూడో వేవ్ ముగిసింద‌ని ఆనంద‌పడుతున్న‌ తరుణంలో తాజాగా వైద్య‌ నిపుణులు హెచ్చరికలు జారీ చేశారు. చైనా, ఆగ్నేయ ఆసియా, ఐరోపా దేశాల్లో కరోనా మళ్లీ విజృంభిస్తున్న సంగ‌తి తెలిసిందే. కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూ.. చైనాలో కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో చైనాలో పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్ అమలు చేస్తుండగా, దక్షిణ కొరియాలో ఒక్కరోజే 6 లక్షలకు పైగా క‌రోనా కేసులు న‌మోద‌వ‌గా, 400కి పైగా మరణాలు సంభవించాయి. మ‌రోవైపు ఇజ్రాయెల్‌లో BA.1, BA.2 వేరియంట్లు వెలుగులోకి వచ్చినట్లు ఆ దేశ‌ ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. దీంతో కరోనా వైరస్ ఎంత ప్రమాదకరమైందో చాటుతోంది. దీనిపై కేంద్ర స‌ర్కార్ స్పందిస్తూ రాష్ట్రాలకు హెచ్చరికలు చేసింది. కరోనా వైరస్‌ను తక్కువగా అంచనా వేసి నిర్లక్ష్యంగా ఉండొద్దని స్పష్టం చేసింది.

అంతే కాకుండా క‌రోనా టెస్టుల సంఖ్యను పెంచాలని, కరోనా మార్గదర్శకాలను ప్రజలు తప్పనిసరిగా పాటించేలా చూడాలని సూచించింది. ట్రాకింగ్, ట్రేసింగ్, టెస్టింగ్ వేగ‌వంతం చేయాల‌ని ఆదేశించింది. ముఖ్యంగా, బహిరంగ ప్రదేశాల్లో భౌతికదూరం పాటించడం, మాస్కులు ధరించడంపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన పెంచాలని కేంద్రం స్పష్టం చేసింది. క‌రోనా వైరస్‌ పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారో అంతే సంగ‌తు.. పాత‌రోజులు రిపీట్ అవుతాయ‌ని కేంద్రం వార్నింగ్ ఇచ్చింది. అయితే ప్ర‌స్తుతం ఇండియాలో క‌రోనా వ్యాప్తి కనిష్ఠ స్థాయికి పడిపోయింది. అయినా ప్రపంచ దేశాల్లో మళ్లీ క‌రోనా కేసులు పెద్ద ఎత్తున న‌మోద‌వుతుండ‌డంతో కేంద్ర స‌ర్కార్ తాజా హెచ్చ‌రిక‌లు జారీ చేసింది.