Covid -19 : బహిరంగ ప్ర‌దేశాల్లో మాస్క్ త‌ప్ప‌నిస‌రిగా ధ‌రించండి – ఆరోగ్య‌నిపుణులు

దేశంలో రోజురోజుకు కోవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, ప్రజలు మాస్క్‌లు ధరించాలని, కోవిడ్‌కు త‌గిన జాగ్ర‌త్త‌లు

  • Written By:
  • Publish Date - April 14, 2023 / 08:48 AM IST

దేశంలో రోజురోజుకు కోవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, ప్రజలు మాస్క్‌లు ధరించాలని, కోవిడ్‌కు త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ఆరోగ్య‌నిపుణ‌లు సూచిస్తున్నారు. రద్దీగా ఉండే ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని ప్ర‌ముఖ పల్మ‌నాలజిస్ట్ డాక్టర్ సందీప్ నాయర్ తెలిపారు. COVID-19 కేసుల పెరుగుదల నేప‌థ్యంలోప్రజలు మాస్క్‌లు ధరించడం ప్రారంభించాల‌ని వైద్యులు తెలిపారు. రద్దీగా ఉండే ప్రదేశానికి వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలి. ఆసుపత్రులు మొదలైన ప్రదేశాలలో డబుల్ లేయర్ మాస్క్‌లను ఉపయోగించాల‌ని వైద్యులు సూచిస్తున్నారుఉ ఎందుకంటే ఇది ఇన్‌ఫెక్షన్‌ను నివారించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుందని డాక్టర్ నాయర్ అన్నారు. ప్రభుత్వాలు కూడా ప్ర‌జ‌ల‌ను ఆప్ర‌మ‌త్తంగా ఉంచాల‌ని.. ర‌ద్దీ ప్రదేశాలలో ఫేస్ మాస్క్‌లు ధరించడం తప్పనిసరి చేయాలని తెలిపారు. గొంతు నొప్పి, దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలతో రోగులు త‌మ వద్దకు వస్తున్నారని డాక్ట‌ర్లు తెలిపారు. అటువంటి లక్షణాలు ఉన్న రోగులకు ఏడు రోజుల పాటు కఠినమైన హోమ్ ఐసోలేషన్‌లో ఉండాలని తాము సలహా ఇస్తున్నామ‌ని వైద్యులు తెలిపారు.

చాలా తక్కువ మంది రోగులు ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఉంది. కొన్ని తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న రోగులను మాత్రమే ఆసుపత్రిలో చేర్చవలసి ఉంటుందని డాక్ట‌ర్ సందీప్ నాయ‌ర్ తెలిపారు. క్యాన్సర్, ఇతర తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న రోగులు ఈ రూపాంతరం నుండి ఎక్కువ ప్రమాదంలో ఉన్నారని.. వారు త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌న్నారు. ఢిల్లీ ఆరోగ్య శాఖ విడుదల చేసిన రోజువారీ బులెటిన్ ప్రకారం దేశ రాజధానిలో బుధవారం 1,149 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి, మంగళవారం నుండి 980 కేసులు నమోదయ్యాయి.