Covid like virus BtSY2: కోవిడ్ కంటే ప్రమాదకరమైన వైరస్..మానవుల్లో వ్యాపిస్తే వినాశనమే..!!

  • Written By:
  • Publish Date - November 26, 2022 / 12:40 PM IST

కోవిడ్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా కలిగించిన వినాశనం అందరికీ తెలిసిందే. కోవిడ్ కారణంగా మిలియన్ల మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచంలో కొన్నిదేశాల్లో కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టినా…మరికొన్ని దేశాల్లో దీని ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. అయినప్పటికీ ఇప్పుడు మరో వైరస్ ను గుర్తించారు శాస్త్రవేత్తలు. ఇది కూడా పుట్టింది చైనాలోనే. దక్షిణ చైనాలోని గబ్బిలాల్లో ఈ వైరస్ ను గుర్తించారు. ఈ వైరస్ ఐదుగురిలో ఒకరికి వ్యాపించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ వైరస్ ను Btsy2 అని నామకరణం చేశారు. ఇది SARS -CoV-2Kకి దగ్గరి పోలికలు ఉన్నట్లుగా వెల్లడించారు.

చైనాలోని యునాన్ ప్రావిన్స్ లోని గబ్బిలాల్లో కనిపించే ఐదు ప్రమాదకరమైన వైరస్ లలో ఇది ఒకటి. ఇది మానవులకు, జంతువులకు వ్యాప్తిస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. జంతువుల నుంచి మానవులకు వ్యాపించే ఛాన్స్ ఎక్కువగా ఉందని చెబుతున్నారు. డైలీ మెయిల్ ప్రకారం…ఈ పరిశోధనకు షెన్ జెన్ ఆధారిత సన్ యాట్ సేన్ యూనివర్సిటీ, యునాన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎండిమిక్ డిసీజ్ కంట్రోల్, సిడ్నీ యూనివర్సిటీ పరిశోధకులు నాయకత్వం వహించారు. ఈ పరిశోధన బ్రుందం చెప్పిన వివరాల ప్రకారం…మానవులకు . జంతువులకు వ్యాపించే ఐదు రకాల వైరస్ జాతులను గుర్తించాము. ఇది కోవిడ్ వైరస్ ను పోలీ ఉంటుంది. రీకాంబినేషన్ సార్స్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ కొత్త వైరస్ SARS -CoV-2, 50 SARS -CoV రెండింటికీ దగ్గరి సంబంధం కలిగిఉన్నట్లు తెలిపారు.

15రకాల గబ్బిలాలకు చెందిన జాతులకు సంబంధించి మూత్ర నమూనాలను సేకరించారు. చైనాలోని యూనాన్ ప్రావిన్స్ లోని ఆరు కౌంటీలు లేదా నగరాల్లో గబ్బిలాలో జీవకణాల్లో ఉండే ఆర్ఎన్ఏ అనే న్యూక్లియన్ యాసిడ్ ను ఒక్కో గబ్బిలం నుంచి వెలికి తీసి సీక్వెన్స్ చేశారు. ఒక బ్యాట్ కి ఒకేసారి అనేక వైరస్ లు సోకినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. Btsy2 రిసెప్టర్ బైండింగ్ డొమైన్ కూడా ఉంది. ఇది స్పైక్ ప్రొటీన్ ముఖ్యమైన భాగం. ఇది కణాలను, మానవ కణాలకు సంబంధించినది. ఈ సార్స్ ను పోలీ ఉంటుంది. ఇది మానవుల్లో తొందరగా వ్యాప్తి చెందుతుందని తెలిపారు.