చైనా నుంచి వచ్చిన బిజినెస్ మ్యాన్ కు కరోనా పాజిటివ్.. అధికారులు హైఅలర్ట్!

కరోనా మహమ్మారి పోయిందని అనుకున్నా అందరికీ ఇప్పుడు మరో గుబులు పట్టుకుంది. తాజాగా ఒమిక్రాన్ మరో వేరియంట్ అయిన బీఎఫ్7 తన కోరలు చాస్తోంది. చైనాలో దీని వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.

Published By: HashtagU Telugu Desk
Covid Bf.7 Variant Explained New Variant Symptoms Precautions 1024x546

Covid Bf.7 Variant Explained New Variant Symptoms Precautions 1024x546

కరోనా మహమ్మారి పోయిందని అనుకున్నా అందరికీ ఇప్పుడు మరో గుబులు పట్టుకుంది. తాజాగా ఒమిక్రాన్ మరో వేరియంట్ అయిన బీఎఫ్7 తన కోరలు చాస్తోంది. చైనాలో దీని వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఈ వేరియంట్ కేసులు యూరప్ లోనూ చాలా మందిని వణికిస్తున్నారు. కొందరు ప్రాణాలను పోగొట్టుకున్నారు కూడా. అయితే ఈ వేరియంట్ భయం ఇప్పుడు ఇండియాకు చేరింది.

చైనాలో కోవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ బీఎఫ్‌.7 కల్లోలం రేపుతున్న తరుణంలో ఇప్పటికే ఈ కొత్త వేరియంట్‌కు సంబంధించి భారత్‌లో నాలుగు కేసులు నమోదవ్వటం గమనార్హం. తాజాగా మూడు రోజుల క్రితం చైనా నుంచి గుజరాత్ కు వచ్చిన ఓ వ్యక్తికి కోవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. అయితే దీనిపై అందరూ ఆందోళన చెందుతున్నారు.

గుజరాత్‌లోని గాంధీనగర్‌కు చెందిన 34 ఏళ్ల వ్యాపారవేత్తకు పాజిటివ్‌గా తేలడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ వ్యక్తి నమూనాలను గాంధీనగర్‌లోని పరిశోధన కేంద్రానికి తరలించారు. ప్రస్తుతం జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కోసం నమూనాలను టెస్ట్ చేస్తున్నారు.

ఇండియాకు వచ్చిన ఈ వ్యాపారవేత్త తన బిజినెస్ నిమిత్తం ఈ మధ్యనే చైనాకు వెళ్లి వచ్చారు. డిసెంబర్‌ 19వ తేది భారత్‌కు ఆయన తిరిగొచ్చారు. కరోనా కేసుల పెరుగుదల ఆందోళన నేపథ్యంలో విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే వారికి తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించాలని గుజరాత్‌ ఆరోగ్య శాఖ మంత్రి రుషికేశ్‌ పటేల్‌ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో భావ్‌నగర్‌కు చెందిన వ్యక్తికి పాజిటివ్‌గా తేలడంతో అధికారులు అలర్ట్ అయ్యి ప్రజలకు జాగ్రత్త చర్యలు చెబుతున్నారు. భారత్ లో ఒమిక్రాన్ బీఎఫ్7 వేరియంట్ కేసులు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా మూడు కేసులు నమోదైనట్లు అధికారుల ఘనాంకాలు చెబుతున్నాయి. ఈ తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

  Last Updated: 22 Dec 2022, 09:53 PM IST