Corona Virus : అమెరికా ల్యాబ్ లో కోవిడ్ ప్రాణాంతక వైరస్ డెవలప్…నిప్పుతో చెలగాటం..!!

కరోనా వైరస్ ప్రభావం తగ్గడంతో ఇప్పుడిప్పుడే ఊపిరిపీల్చుకుంటున్న ప్రపంచాన్ని కొత్త వేరియంట్ మరోసారి అప్రమత్తం చేసింది.

  • Written By:
  • Publish Date - October 20, 2022 / 11:09 AM IST

కరోనా వైరస్ ప్రభావం తగ్గడంతో ఇప్పుడిప్పుడే ఊపిరిపీల్చుకుంటున్న ప్రపంచాన్ని కొత్త వేరియంట్ మరోసారి అప్రమత్తం చేసింది. ఓ వైపు ఓమిక్రాన్ పలు వేరియంట్లలో ప్రపంచవ్యాప్తంగా కొరలు చాచుతోంది. ఈనేపథ్యంలోనే అమెరికా ల్యాబ్ లో డెవలప్ అయిన అత్యంత ప్రమాదకరమైన కోవిడ్ కొత్త వేరియంట్ మరింత భయాందోళనను రేకెత్తిస్తోంది. అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీలో శాస్త్రవేత్తలు ఈ వైరస్ ను డెవలప్ చేశారన్న పుకార్లు వినిపిస్తున్నాయి. ఇది దాదాపు 80శాతం మరణాల రేటను కలిగి ఉంటంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రపంచంలో విస్తరిస్తున్న ఓమిక్రాన్ కొత్త వేరియంట్ ప్రమాదకరం కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నప్పటికీ… అమెరికాలో డెవలప్ అయిన వైరస్ వెలుగులోకి రావడంతో ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ఎన్నో ప్రశ్నలను లేవనెత్తతున్నారు. ఇది నిప్పుతో ఆడుకున్నట్లే అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈవైరస్ ఐదు రెట్లు ఎక్కువ ప్రమాదం.
మొదటకోవిడ్ ఓమిక్రాన్ వేరియంట్ నుంచి స్పైక్ ప్రోటీన్ సెకరించి…మొదటిసారిగా చైనాలోని వుహాన్ సిటీలో ఒకరూపం కనుగొన్నారు. ఈ పరిశోధనను ఎలుకలపై జరిపారు. దీంతో ఎలుకల్లో తేలికపాటి లక్షణాలు కనిపించాయి. అంత ప్రాణాంతకం కాదని తెలిపారు. అయితే అమెరికా ల్యాబ్ లో డెవలప్ చేసిన ఓమిక్రాన్ ఎస్ వైరస్ తో 80శాతం ప్రమాదం పొంచిఉందని వెల్లడించారు. ఈ కొత్త వైరస్ ద్వారా పరిశోధనలోపాల్గొన్న 80 శాతం ఎలుకలు మరణించాయని వెల్లడించారు. బోస్టన్ పరిశోధకులు కొత్త రకం వైరస్ లో ఐదు రెట్ల కంటే ఎక్కువ ఇన్ఫెక్షన్ కణాలు ఉన్నాయని గుర్తించారు. దీంతో ప్రపంచంలో తొలిసారిగా వచ్చిన కోవిడ్ 19 కూడా ల్యాబోరేటరీలో జరిగిన పొరపాటు వల్లే వచ్చిందా అనే అనుమానం చాలా మందిలో కలుగుతోంది.

ఇజ్రాయెల్ కు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త ప్రొఫెసర్ శామ్యూల్ ను ఉటంకిస్తూ డైలీ మెయిల్ ఓ కథనం రాసింది. కరోనా వైరస్ ప్రారంభమైనప్పుడు ఈ వైరస్ వూహాన్ ఇన్ట్సిట్యూట్ ఆఫ్ వైరాలజీలో సృష్టించబడిందని చాలా మంది నమ్మారు. ఇప్పుడు జరుగుతున్నది ఏంటి. ఇలాంటి పరిశోధనలను పూర్తి నిషేధించాలి. ఇది నిప్పుతో ఆడుకోవడం లాంటిదని అమెరికాను ఉద్దేశిస్తూ అన్నారు.

దీనిపై బోస్టన్ యూనివర్సిటీ ప్రతినిధి స్పందించారు. మా పరిశోధన ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తులో కోవిడ్ మహమ్మారితో పోరాడేందుకు సహాయపడుతుంది. అంతేకాని భద్రతా ప్రమాణాలు లేకుండా పరిశోధన జరిపినట్లు ఎలాంటి ఆధారలు లేవని బోస్టన్ యూనివర్సిటీ స్పష్టం చేసింది. దీన్ని బోస్టన్ పబ్లిక్ హెల్త్ కమిషన్ , బయె సేఫ్టీ రివ్యూ కమిటీ ఆమెదించినట్లు వెల్లడించింది.