Piracy Racket: ప్రపంచవ్యాప్తంగా ప్రీమియం కంటెంట్‌ను అనధికారికంగా ప్రసారం చేస్తున్న (Piracy Racket) ఒక పెద్ద ముఠాకు ఇప్పుడు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ విజయానికి వెనుక నిలిచినది భారత సాంకేతిక రంగానికి చెందిన ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ YuppTV. ఈ సంస్థ గత రెండు సంవత్సరాలుగా భారత, అమెరికా అధికారులతో కలిసి పనిచేస్తూ ఇప్పుడు ఈ ముఠాకు భారీ షాక్ ఇచ్చింది.
Boss IPTV, Guru IPTV, Tashan IPTV వంటి పేర్లతో నడుస్తున్న ఈ ముఠా స్టార్, సోనీ, జీ, సన్ నెట్‌వర్క్, ఆహా, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి టాప్ చానెల్స్, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల కంటెంట్‌ను పైరసీ చేస్తూ ప్రసారం చేస్తూ కోట్లాదిమందికి సేవలు అందిస్తోంది. వీటిని Android, Linux సెటప్ బాక్సులు, స్మార్ట్ టీవీలు, మొబైల్ యాప్‌లు ద్వారా వినియోగదారులకు చాలా తక్కువ ధరల్లో అందించి, వేల కోట్ల ఆదాయం కొల్లగొడుతోంది.
Also Read: BCCI: బీసీసీఐ కీలక నిర్ణయం.. వేదికలను మార్చిన టీమిండియా క్రికెట్ బోర్డు!
అయితే ఇది కేవలం ప్రసార హక్కుల ఉల్లంఘనకే పరిమితం కాలేదు. అధికారులు వెల్లడించినట్లుగా ఈ సంస్థలు వినియోగదారుల క్రెడిట్ కార్డ్ వివరాలు, పాస్‌వర్డులు, వ్యక్తిగత సమాచారం సేకరించి.. ఫిషింగ్, టాక్స్ మోసం, ఉగ్రవాద మద్దతు వంటి తీవ్ర నేరాలకు ఉపయోగించే అవకాశం ఉన్నట్లు గుర్తించారు.
రూ. 700 కోట్ల వార్షిక ఆదాయం, ఐదు మిలియన్ల వినియోగదారులు
గుజరాత్ సైబర్ క్రైమ్ విభాగం తాజాగా మొహమ్మద్ ముర్తుజా అలీ అనే వ్యక్తిని అరెస్టు చేసింది. అతనే Boss IPTV వ్యవస్థను నడిపే ప్రధాన నిందితుడిగా గుర్తించారు. పంజాబ్‌లోని జలంధర్ కేంద్రంగా ఈ ముఠా పనిచేస్తూ సంవత్సరానికి రూ. 700 కోట్లకు పైగా ఆదాయం రాబడుతో దేశవ్యాప్తంగా విస్తరించింది.
అమెరికాలో కేసు డిపోర్టేషన్‌కు అవకాశం
ఈ వ్యవహారం అంతర్జాతీయ దర్యాప్తుగా మారింది. YuppTV అమెరికాలో Goldstein Law Group, LLC ద్వారా కేసు నమోదు చేసింది. అమెరికా క్రిమినల్ చట్టం 18 U.S.C. 2319 ప్రకారం.. చోరీ ఐపిటీవీ సేవలు వాడటమే నేరం. ఇక విదేశీయులైతే డిపోర్టేషన్‌కు గురయ్యే అవకాశం ఉందని న్యాయవాదులు హెచ్చరిస్తున్నారు.