Site icon HashtagU Telugu

Nikhil Vijayendra Simha : యూట్యూబ్ నుంచి వెండితెరపైకి.. హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న నిహారిక ఫ్రెండ్.. టైటిల్ ఏంటంటే..?

Youtuber Nikhil Vijayendra Simha New Movie Title Announced

Nikhil

Nikhil Vijayendra Simha : ఇటీవల సోషల్ మీడియాలో పాపులర్ అయిన వాళ్ళు, యూట్యూబర్స్, బిగ్ బాస్ కి వెళ్లొచ్చిన వాళ్ళు హీరోగా మారుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ లిస్ట్ లో ఇప్పుడు మరో యూట్యూబర్ చేరుతున్నాడు. యూట్యూబ్ లో ఇంటర్వ్యూలు,పలు షార్ట్ ఫిలిమ్స్ తో పాపులర్ అయిన నిఖిల్ ఇప్పుడు హీరోగా రాబోతున్నాడు. నిహారిక ఫ్రెండ్ గా నిఖిల్ మరింత వైరల్ అయ్యాడు. నిహారికతో రెగ్యులర్ గా కనిపిస్తూ, నిహారిక కూడా నిఖిల్ గురించి మంచి ఫ్రెండ్ అని చెప్పడంతో నిఖిల్ మరింత పాపులర్ అయ్యాడు.

ఇప్పుడు ఈ యూట్యూబర్ హీరోగా మారి సినిమాతో రాబోతున్నాడు. RB స్టూడియోస్, లహరి ఫిలిమ్స్ నిర్మాణంలో నిఖిల్ హీరోగా సాద్ ఖాన్ దర్శకత్వంలో గతంలో ఓ సినిమాని ప్రకటించారు. ఆ సినిమా ఓపెనింగ్ కూడా చేసారు. అయితే ఆ తర్వాత సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ లేకపోవడంతో అసలు ఆ సినిమా ఉందా లేదా అని సందేహాలు కూడా వచ్చాయి.

తాజాగా నేడు నిఖిల్ పుట్టిన రోజు కావడంతో ఆ సినిమా ఇంకా ఉందని గుర్తుచేస్తూ నిఖిల్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఈ సినిమాకు సంగీత్ అనే టైటిల్ ని ప్రకటించారు. మరి సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో మెప్పించిన నిఖిల్ వెండితెరపై హీరోగా మెప్పిస్తాడా చూడాలి.

 

Also Read : Kakinada GGH Hospital : కాకినాడ డాక్టర్స్ అదుర్స్.. ‘సినిమా చూపిస్తూ సర్జరీ’..