Vijay Devarakonda: యూత్ పెద్ద కలలు కనాలి, విజయం సాధించాలి: ఫ్యామిలీ స్టార్ విజయ్ దేవరకొండ

నేటి యువత పెద్ద కలలు కనాలని, అందుకు తగ్గట్టుగా శ్రమించి లక్ష్యాలను అధిరోహించాలని విజయ్ దేవరకొండ అన్నారు.

  • Written By:
  • Updated On - October 30, 2023 / 11:40 AM IST

Vijay Devarakonda: టాలీవుడ్ రౌడీ భాయ్ విజయ్ దేవరకొండ ఒకప్పుడు సామాన్య కుర్రాడు. అనుకోకుండా సినిమాల్లోకి అడుగుపెట్టి తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు. మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా వేశాలు వేసిన విజయ్ దేవరకొండ నేడు హీరోగా దూసుకెళ్తున్నాడు. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ మధ్య తరగతి కుర్రాళ్ల జీవితాలు ఎలా ఉంటాయో చెప్పాడు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన విజయ్ దేవరకొండ ప్రతి యువకుడికి పెద్దగా కలలు కనే హక్కు ఉందని, తాను ఎంచుకున్న జీవితంలో విజయం సాధించాలని పేర్కొన్నాడు.

“నేను, తరుణ్ భాస్కర్ పెద్ద కలలు కనేవాళ్ళం. ఎన్నో కష్టాలు పడి మా జీవితంలో విజయం సాధించగలిగాం, మేం మా జేబులో రూపాయి లేకుండా కూడా రాజుల వలె వీధుల్లో తిరిగాం. ఒక మధ్యతరగతి వ్యక్తి విజయం సాధిస్తే, అతడు తన మొత్తం కుటుంబ స్థితిని మార్చగలడు. ప్రస్తుతం మన దగ్గర డబ్బు లేకపోవచ్చు, కానీ మన దేశంలో 90% మంది మధ్యతరగతి కుర్రాళ్లు ఎన్నో కలలు కంటారు. అందుకు తగ్గట్టుగా కష్టపడితే రేపు ధనవంతులం కావచ్చు” అని చెప్పాడు విజయ్ దేవరకొండ.  తన స్నేహితుడు తరుణ్ భాస్కర్ సినిమాని ప్రమోట్ చేసే కార్యక్రమంలో చెప్పాడు ఈ హీరో.

వర్క్ ఫ్రంట్‌లో విజయ్ రాబోయే చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ విడుదల కోసం ఎదురు చూస్తున్నాడు. ఇది మధ్యతరగతి కుర్రాళ్ల చుట్టూ కూడా తిరుగుతుంది. “ఒక మధ్యతరగతి వ్యక్తిగా, నేను ఈ చిత్రంలో నటించాను. నిజ జీవితంలో నేను పాత్రతో బాగా కనెక్ట్ అయి ఉంటుంది” అని అతను చెప్పాడు. లైగర్ తర్వాత విజయ్ దేవరకొండ కు ఖుషి రూపంలో సక్సెస్ వచ్చింది.

Also Read: Dasoju Sravan: డీకే శివకుమార్‌ ఓ CBI కేసులో దొంగ: దాసోజు శ్రవణ్