యంగ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ‘జాతిరత్నాలు’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచేసిన ఫరియా, ప్రముఖ యాంకర్ సుమ కనకాల హోస్ట్ చేస్తున్న ఓ చాట్ షోలో పాల్గొంది. కార్యక్రమం సందర్భంగా సుమ అడిగిన ఆసక్తికరమైన ప్రశ్నలకు ఫరియా కూడా డేర్‌గా సమాధానాలు ఇచ్చింది. “మీకు అవకాశం వస్తే ఎవరితో డేటింగ్ చేస్తారు? ఎవరిని పెళ్లి చేసుకుంటారు?” అని సుమ అడిగితే, ఫరియా మాత్రం తడుముకోకుండా, “పవన్ కళ్యాణ్(Pawan Kalyan)తో డేటింగ్ చేస్తాను, ప్రభాస్(Prabhas)ను పెళ్లి చేసుకుంటాను” అని బోల్డ్‌గా చెప్పింది.
Rohit Sharma- Virat Kohli: ఇంగ్లండ్ పర్యటనకు విరాట్, రోహిత్ వెళ్తారా? కోచ్ గంభీర్ స్పందన ఇదే!
ఫరియా చెప్పిన ఈ మాటలు ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ మరియు ప్రభాస్ అభిమానుల్లో జోష్ నింపాయి. ఫరియా స్టేట్‌మెంట్‌కు స్పందించిన అభిమానులు తమ హీరోలు ఎంతగా ఫేమస్ అయి ఉన్నారో ఈ వ్యాఖ్యలే నిదర్శనమని అంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ఈ క్లిప్స్, వ్యాఖ్యలు షేర్ అవుతూ ట్రెండింగ్‌లోకి వచ్చాయి. ఫరియా మాత్రం తన బోల్డ్ అన్సర్స్‌తో ఓపెన్ మైండెడ్ నేచర్‌ను ప్రదర్శించింది.
ఫరియా అబ్దుల్లా గురించి చెప్పాలంటే.. ఆమె డ్యాన్సర్‌గా కెరీర్ మొదలుపెట్టి, నటనపై ఆసక్తితో ‘జాతిరత్నాలు’ చిత్రానికి ఆడిషన్ ఇచ్చి ‘చిట్టి’ పాత్ర ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. ఆ పాత్ర ఆమెకు మంచి క్రేజ్‌ను తీసుకొచ్చింది. ఇప్పటికీ ఆ పాత్ర పేరుతోనే గుర్తుపడే ప్రేక్షకులు ఉన్నారు. ప్రస్తుతం ఫరియా పలు కొత్త సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.