Site icon HashtagU Telugu

Akhil Akkineni: ఆ కొత్త దర్శకుడితో మూవీ ప్లాన్ చేస్తున్న అఖిల్ అక్కినేని.. ఈసారైనా సక్సెస్ అవుతాడా?

Mixcollage 08 Feb 2024 07 54 Am 7912

Mixcollage 08 Feb 2024 07 54 Am 7912

టాలీవుడ్ అక్కినేని హీరో అఖిల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్కినేని నాగార్జున తనయుడిగా సినిమా ఇండస్ట్రీ గురించి వచ్చిన అఖిల్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు. అయితే సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఏళ్ళు పూర్తి అవుతున్న కూడా అఖిల్ కెరియర్ లో ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ సరైన హిట్ ఒకటి కూడా లేదు. ఐదు సినిమాలలో నటించగా అందులో ఒక్క సినిమా కూడా సూపర్ హిట్ కానీ బ్లాక్ బస్టర్ హిట్ కానీ అవ్వలేదు. అంతేకాకుండా కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఏజెంట్ అఖిల్ వంటి సినిమాలు కూడా ఊహించని విధంగా దారుణంగా నష్టాలను మిగిల్చాయి.

ఇంకా చెప్పాలంటే అక్కినేని అభిమానులను బాధిస్తున్న విషయం ఏమిటంటే అఖిల్ తర్వాత ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరోలు సక్సెస్ లు అందుకొని దూసుకుపోతున్న కూడా అఖిల్ మాత్రం కెరియర్ లో ఇంకా వెనుకబడ్డాడు. దీంతో అఖిల్ కెరియర్ పై అక్కినేని అభిమానులు దిగులు చెందుతున్నారు. మరొకవైపు అఖిల్ తో సినిమాలు చేయడానికి కూడా డైరెక్టర్లు నిర్మాతలు ముందుకు రావడం లేదు. అందుకు గల కారణం ఇప్పటివరకు అఖిల్ నటించిన సినిమాలు అన్నీ కూడా డిజాస్టర్లు కావడమే. ఇకపోతే తాజాగా అఖిల్ కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. అదేమిటంటే.. అఖిల్ నెక్ట్స్ మూవీ విషయంలో ఆల్రెడీ క్లారిటీ వచ్చేసింది.

కొత్త దర్శకుడితో నెక్ట్స్ మూవీని కన్ఫాన్మ్ చేశారట అక్కినేని అఖిల్. కానీ ఈ సినిమా పట్టాలెక్కడానికి మాత్రం ఇంకా చాలా సమయం పట్టేలా ఉంది. దీంతో అసలు అఖిల్‌ ఎందుకింత ఆలస్యం చేస్తున్నారన్న డిస్కషన్ జరుగుతోంది. ఏజెంట్ సినిమాతో నిరాశపరిచిన అఖిల్ ఆ తరువాత డైలామాలో పడ్డారు. నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌కు ఎలాంటి సబ్జెక్ట్‌ తీసుకోవాలి, దర్శకుడిగా ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి అన్న నిర్ణయం తీసుకోవడానికే చాలా సమయం తీసుకున్నారు. అఖిల్ నెక్ట్స్ మూవీ విషయంలో ఆల్రెడీ క్లారిటీ వచ్చేసింది. కొత్త దర్శకుడితో నెక్ట్స్ మూవీని కన్ఫాన్మ్ చేశారు అక్కినేని ప్రిన్స్‌. కానీ ఈ సినిమా పట్టాలెక్కడానికి మాత్రం ఇంకా చాలా టైమ్‌ పట్టేలా ఉంది. దీంతో అసలు అఖిల్‌ ఎందుకింత ఆలస్యం చేస్తున్నారన్న డిస్కషన్ జరుగుతోంది. అఖిల్ మాత్రం ఈ సారి ఎట్టి పరిస్థితుల్లో టార్గెట్ మిస్ అవ్వకూడదన్న ఉద్దేశంతోనే స్లో అండ్ స్టడీగా సినిమా పనులు కానిచ్చేస్తున్నారట. పీరియాడిక్ మూవీ కావటంతో భారీగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కొందరు ఈ వార్తలపై స్పందిస్తూ కనీసం ఈసారైనా సక్సెస్ అవుతాడా మళ్లీ అదే విధంగా నిరాశ పరుస్తాడా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.