Niharika Konidela: అవును మేం ఇద్దరం విడిపోతున్నాం, విడాకులపై నిహారిక రియాక్షన్

తాము ఇద్దరం పరస్పర అంగీకారంతో విడిపోతున్నామని క్లారిటీ ఇచ్చారు నిహారిక.

Published By: HashtagU Telugu Desk
Niharika

Niharika

మెగాడాటర్ నిహారికా ఎట్టకేలకు డివోర్స్ రూమర్స్ పై స్పందించారు. తాము ఇద్దరం పరస్పర అంగీకారంతో విడిపోతున్నామని క్లారిటీ ఇచ్చారు. ఈ సమయం ఇద్దరికీ చాలా కీలకమని చెప్పిన నిహారికా తమను ఇబ్బంది పెట్టొద్దంటూ ఇన్ స్టాలో పోస్టు చేశారు. ఇక నుంచి కొత్తగా తమ జీవితాలను ప్రారంభించబోతున్నామని చెప్పిన నిహారిక తమ వ్యక్తిగత జీవితంలో ప్రైవసీ కోరుకుంటున్నట్లు పేర్కొంది. దీన్ని అందరూ గౌరవించాలని విజ్ఞప్తి చేసింది.ఈ కష్ట సమయంలో తనకు అండగా నిలిచిన కుటుంబం, సన్నిహితులకు నిహారిక థ్యాంక్స్ చెప్పుకొచ్చింది. నిహారిక భర్తతో విడిపోయిందంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే.

ఇక ఇన్ స్టా నుంచి ఇద్దరూ ఫోటోలను డిలీట్ కూడా చేశారు. అప్పుడే వీరిద్దరి మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయనే టాక్ ఫిలింనగర్‌లో నడిచింది. రెండేళ్ల క్రితం ఎంతో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న మెగా డాటర్ నిహారిక, చైతన్య జొన్నలగడ్డ ఎట్టేకేలకు విడాకులు తీసుకున్నారు. దీంతో ఈ మ్యాటర్ ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.

గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నిహారిక విడాకుల ఇష్యూపై మొత్తానికి ఓ క్లారిటీ అయితే వచ్చేసింది. నిహారిక తన భర్తతో విడిపోవడం నిజమేనని అధికారిక సమాచారం బయటకు వచ్చింది. వీరి డైవోర్స్ మంజూరు చేస్తూ కోర్టు తీర్పు కూడా ఇచ్చింది. మెగాస్టార్ చిరంజీవి పెద్ద తమ్ముడు నాగబాబు ఒకానొక్క కూతురు నిహారిక. చైతన్య జొన్నలగడ్డ విషయానికొస్తే.. మాజీ ఐజీ ప్రభాకర రావు కుమారుడు. వీరిద్దరు ఏప్రిల్ 1న విడాకులు కోరుతూ కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు.

Also Read: Pawan Kalyan: మూడో భార్యకు పవన్ విడాకులు? రష్యాలోనే అన్నా లెజ్నెవా మాకాం!

  Last Updated: 05 Jul 2023, 12:33 PM IST