Site icon HashtagU Telugu

Yellamma : ఎల్లమ్మ కథ మరో హీరో దగ్గరకి వెళ్లిందా..?

Yellamma Story Went To Another Hero

Yellamma Story Went To Another Hero

Yellamma ఇన్నాళ్లు కమెడియన్ గా అలరించిన వేణు ఎల్దండి డైరెక్టర్ గా మారి చేసిన తొలి ప్రయత్నం బలగం. దిల్ రాజు బ్యానర్ లో వారసులు నిర్మించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. బలగం తర్వాత వేణు ఎల్లమ్మ కథ సిద్ధం చేసుకున్నాడు. నాని హీరోగా ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని కొన్ని వార్తలు వచ్చాయి. దిల్ రాజు నిర్మించాలనుకుంటున్న ఈ సినిమా బడ్జెట్ ఇష్యూస్ వల్లో మరో కారణమో కానీ సినిమాను కాదనుకున్నారు.

ఐతే వేణు ఈ కథను వేరే హీరోతో చేయాలని అనుకుంటున్నాడని తెలుస్తుంది. వేణు (Venu) ఎల్లమ్మ కథ నాని నుంచి శర్వానంద్ దగ్గరకి వెళ్లిందని టాక్. ఐతే శర్వానంద్ కూడా ఆలోచిద్దాం అనేసరికి అతని దగ్గర నుంచి హీరో నితిన్ దగ్గరకు వెళ్లిందని తెలుస్తుంది. నితిన్ (Nitin) హీరోగా ఎల్లమ్మ సినిమా మొదలవుతుందని లేటెస్ట్ ఫిల్మ్ నగర్ టాక్.

Also Read : Thangalaan: తంగలాన్ ఎందుకంత స్పెషల్?

బలగం తో బ్లాక్ బస్టర్ కొట్టిన డైరెక్టర్ కాబట్టి ఆటోమెటిక్ గా ఈ ఎల్లమ్మ సినిమాపై కూడా అంచనాలు పెరిగాయి. దిల్ రాజు ఈ సినిమాను అనుకున్న బడ్జెట్ లో పూర్తి చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తుంది. నితిన్ ప్రస్తుతం రాబిన్ హుడ్, తమ్ముడు సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ సినిమాలు పూర్తైన తర్వాత ఎల్లమ్మ సెట్స్ మీదకు వెళ్లే ఛాన్స్ ఉంది.

ఎల్లమ్మ (Yellamma) సినిమా కథ ఏంటి అసలు వేణు ఈ టైటిల్ తో ఎలాంటి కథ చెబుతున్నాడు. మరోసారి కూడా తెలంగాణా నేపథ్యాన్ని చూపిస్తాడా అన్నది తెలియాల్సి ఉంది. ఐతే బలంగ లా తక్కువ బడ్జెట్ తో కాకుండా ఈసారి మీడియం రేంజ్ బడ్జెట్ తో ఎల్లమ్మని తెరకెక్కించే ప్లానింగ్ లో ఉన్నాడు వేణు.