Site icon HashtagU Telugu

Balakrishna : మద్యం మత్తులో స్టేజ్ ఫై నటి అంజలి ని తోసేసిన బాలకృష్ణ – వైసీపీ

Balakrishna Anjali

Balakrishna Anjali

సినీ నటుడు , హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Balakrishna) ఫై వైసీపీ (YCP) తీవ్ర ఆరోపణలు చేసింది. బాలకృష్ణ మద్యం తాగి మరోసారి మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారని వైసీపీ Xలో విమర్శించింది. విశ్వక్ సేన్, నేహా శెట్టి జంటగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ఈ నెల 31 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ చిత్ర ట్రైలర్ , సాంగ్స్ , టీజర్ ఇలా ప్రతిదీ సినిమాపై అంచనాలు పెంచేయగా…తాజాగా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (Gangs of Godavari Pre Release Event ) ను నిన్న రాత్రి హైదరాబాద్ లో అట్టహాసంగా ఏర్పటు చేసారు. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా బాలకృష్ణ హాజరై సందడి చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

స్టేజ్ ఫై బాలకృష్ణతో పాటు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీమ్ మొత్తం ఉంది. ఆ సమయంలో తన పక్కనే ఉన్న హీరోయిన్ అంజలిని కొంచెం పక్కకి జరగమని బాలయ్య చెప్పారు. ఆమె కొంచెమే జరగడంతో ఏమైందో ఏమో కానీ ఒకేసారి అంజలిని పక్కకి నెట్టేశారు బాలయ్య. ఈ సడెన్ షాక్‌కి అంజలి కాస్త వెనక్కి తూలి భయపడింది. ఇక వీరిద్దరి మధ్యలో ఉన్న నేహా శెట్టి అయితే దెబ్బకి బెదిరిపోయింది. వామ్మో ఏంటిది అన్నట్లుగా బిక్కచచ్చిపోతున్న ఎక్స్‌ప్రెషన్ ఇచ్చింది. అయితే అంజలి మాత్రం నవ్వుతూ అలా కవర్ చేసింది . కానీ ఆ వెంటనే బాలయ్య.. మళ్లీ అంజలితో ఏదో మాట్లాడి ఓ హైఫై ఇచ్చారు. దీనికి సంబదించిన వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.

ఈ వీడియో ను వైసీపీ పార్టీ షేర్ చేస్తూ..బాలకృష్ణ మద్యం తాగి మరోసారి మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారని పేర్కొంది. మహిళలంటే టీడీపీకి అంత చులకనా? అని ప్రశ్నించింది. నిన్న జరిగిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీరిలీజ్ ఈవెంట్లో ఆయన కూర్చున్నచోట బాటిల్లో మద్యం ఉండడం.. అంజలిని చేతితో తోసేశారని పేర్కొంది.

Read Also : 1200 Phones Tapped: 1200 మంది ఫోన్లు ట్యాప్‌ చేశాం.. ప్రణీత్‌రావు వాంగ్మూలం