దివంగత నేత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి (YSR) జీవిత కథ ఆధారంగా యాత్ర 2 (Yatra 2) తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. యాత్ర 1 సూపర్ సక్సెస్ కావడం తో యాత్ర 2 తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ మహి వి రాఘవ్ (Mahi V Raghav). త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్, శివ మేక సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీ లో వైస్సార్ పాత్రలో మమ్ముట్టి నటిస్తుండగా..జగన్ పాత్రలో కోలీవుడ్ స్టార్ జీవా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
We’re now on WhatsApp. Click to Join.
ఈ క్రమంలో ఈరోజు ఈ సినిమాలోని సోనియా (Soniya Gandhi) పాత్ర కు సంబదించిన ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేసారు. ‘మీరు అతన్ని ఓడించలేకపోతే.. అతన్ని నాశనం చేయండి’ అనే ట్యాగ్‌లైన్ తో ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసారు. ఈ మూవీ లో సోనియా పాత్రను జర్మనీ నటి సుజానే బెర్నెర్ట్ (Suzanne Bernert) పోషిస్తున్నారు. ఈమె జర్మనీలో పుట్టి పెరిగారు. కమర్షియల్ యాడ్స్, హిందీ చిత్రాలు, వెబ్ సిరీస్‌లు, టీవీ సీరియల్స్‌లో నటించారు. ఆమె సోనియాగా ఎలా మెప్పించబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. యాత్ర 2కి సోనియాకి ఉన్న సంబంధం ఏంటనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందేనంటున్నారు మేకర్స్. ‘యాత్ర’ చిత్రాన్ని ఫిబ్రవరి 8, 2019లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఇప్పుడు ‘యాత్ర 2’ ని కూడా అదే తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు, 2024 ఫిబ్రవరి 8న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతుంది.
Read Also : Exclusive: బిగ్ అప్డేట్, రాజమౌళి-మహేశ్ మూవీ షురూ అయ్యేది అప్పుడే