Yash: యష్ కామెంట్స్.. ‘యువర్ హార్ట్ ఈజ్ మై టెరిటరి’

కన్నడ హీరో యష్ హీరోగా నటించిన KGF-2ఈ సినిమా ఈమధ్యే రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.

  • Written By:
  • Updated On - April 22, 2022 / 04:01 PM IST

కన్నడ హీరో యష్ హీరోగా నటించిన KGF-2ఈ సినిమా ఈమధ్యే రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అంచనాలకు మించి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అంతేకాదు బాక్సాఫీస్ వద్ద ఊహలకు మించి భారీ కలెక్షన్లను రాబట్టింది. ఈ మూవి చూసిన ప్రతి ఒక్కరూ దర్శకుడిపై.. హీరో యష్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రతిఒక్కరూ స్పందిస్తున్నారు. తాజాగా ఈ మూవీ సక్సెస్ పై హీరో యష్ స్పందించారు. కేజీఎఫ్ మూవీపై ప్రేక్షకులు అలాగే అభిమానులు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు తెలిపాడు యశ్.

ఈ సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియోను షేర్ చేశాడు. ఈ వీడియోలో యష్ మాట్లాడుతూ ఒక గ్రామంలో తీవ్ర కరువు రావడంతో ఆ గ్రామస్తులందరూ దేవున్ని ప్రార్థించడానికి ఒక చోటకు వస్తారు. అందులో ఒక అబ్బాయి మాత్రం అక్కడికి గొడుగుతో వెళ్లడంతో అందరూ ఆ అబ్బాయిని చూసి నవ్వుకున్నారు. మూర్ఖత్వమని…ఇంకొందరు అతివిశ్వాసమని అనుకుంటారు. కానీ ఆ అబ్బాయిది నమ్మకం విశ్వాసం. ఆ విధంగా ఆ అబ్బాయి ఏ నమ్మకంతో ఉన్నాడో KGFమూవీ విషయంలోనూ నేను అంతే నమ్మకంగా ఉన్నానని చెప్పుకొచ్చాడు యష్. అలాంటి నా నమ్మకాన్ని నిలబెట్టిన నా అభిమానులకు, ప్రేక్షకులకు నా తరపున చిత్రయూనిట్ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నాడు. మీరందరూ చూపిన ఆదరాభిమానాలకు థ్యాంక్స్ అన్న పదం సరిపోదన్నారు. మీ కోసం ఒక గొప్ప సినిమాను అందించాలి అనుకుంటున్నామని తెలిపాడు. వీడియో చివర్లో మూవీలోఉన్న యువర్ హార్ట్ ఈజ్ మై టెరిటరి అనే డైలాగ్ చెప్పి వీడియోను ముగించేశారు యష్.