Site icon HashtagU Telugu

Yashoda: ఓటీటీలోకి ‘యశోద’ మూవీ. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎందులో అంటే..

Yashoda OTT

Yashoda

సమంత ప్రధాన పాత్ర పోషించిన ‘యశోద’ (Yashoda) చిత్రం ఓటీటీ (OTT)లోకి వచ్చేందుకు సిద్ధమైంది. ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’ (Amazon Prime Video)లో ఈ నెల 9 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్‌ కానుంది. తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రం అందుబాటులో ఉంటుందని సదరు సంస్థ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. హరి – హరీశ్‌ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా థియేటర్లలో నవంబరు 11న విడుదలైన సంగతి తెలిసిందే. సమంత (Samantha) నటనకు ప్రేక్షకులు మంచి మార్కులు వేశారు. సరోగసి పేరుతో జరిగే మోసాల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్‌, ఉన్ని ముకుందన్‌, రావు రమేశ్‌, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ఆర్థిక అవ‌స‌రాల రీత్యా స‌రోగ‌సి ప‌ద్ధ‌తిలో బిడ్డ‌కి జ‌న్మ‌నివ్వ‌డం కోసం డా. మ‌ధు (వ‌ర‌ల‌క్ష్మి శ‌రత్‌కుమార్‌)కి చెందిన ఆస్ప‌త్రిలో చేరుతుంది. ప్ర‌త్యేక ప్ర‌పంచంలా అనిపించే ఆ హాస్పిటల్‌లో జ‌రిగే కొన్ని ప‌రిణామాలు య‌శోద‌లో అనుమానం రేకెత్తిస్తాయి. త‌న‌తోపాటు బిడ్డ‌ల‌కి జ‌న్మ‌నివ్వ‌డం కోసం ఆస్ప‌త్రిలో చేరిన తోటి మ‌హిళ‌లు అనుమానాస్ప‌ద రీతిలో క‌నుమ‌రుగైపోతుంటారు. ఇంత‌కీ ఆ మ‌హిళ‌లు ఏమ‌వుతున్నారు? య‌శోద (Yashoda) త‌న అనుమానాల్ని నివృత్తి చేసుకోవ‌డం కోసం ఏం చేసింది? ఆ ఆ క్ర‌మంలో ఆమెకి ఎలాంటి విష‌యాలు తెలిశాయి? ఆ ఆస్ప‌త్రిలో సంఘ‌ట‌న‌ల‌కీ, బ‌య‌ట జ‌రిగిన మ‌రో రెండు హ‌త్య‌ల‌కీ సంబంధమేమిటనేది అసలు క‌థ‌.

Also Read:  Christmas Cake : క్రిస్మస్‌ ప్లమ్ కేక్ చరిత్ర తెలుసా?

Exit mobile version