Site icon HashtagU Telugu

KGF@1200Cr:1200 కోట్ల కలెక్షన్స్ కు చేరువలో ‘కేజీఎఫ్-2’

Kgf2

Kgf2

బాక్సాఫీస్ వద్ద ‘కేజీఎఫ్-2’ కలెక్షన్ల పర్వం కొనసాగుతోంది. నేడో, రేపో కలెక్షన్లు రూ.1200 కోట్లు దాటే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1,185.17 కోట్లను కలెక్ట్ చేసింది. ఏప్రిల్ 14న విడుదలైన ఈ మూవీ కేవలం నెల రోజుల్లో ఇంత భారీ కలెక్షన్లను మూట కట్టుకోవడం విశేషం.

కేవలం మొదటి వారంలోనే దీనికి రూ.720.31 కోట్ల కలెక్షన్స్ రావడం గమనార్హం. కర్నాటకలో రూ.100 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ.78 కోట్లు, తమిళనాడులో రూ.27 కోట్లు, కేరళలో రూ. 10 కోట్లు, ఇతర రాష్ట్రాల్లో రూ.100 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ఈవిధంగా ఇండియాలోని అన్ని భాషల్లో కలుపుకుని కలెక్షన్స్ రూ.900 కోట్లు దాటాయి. కాగా, కేజీఎఫ్‌ 2 సినిమా నిర్మాత విజయ్ కిరంగదూర్‌ ఒక ఇంటర్వ్యూలో కీలక ప్రకటన చేశారు.

‘కేజీఎఫ్‌ 3 మూవీని మార్వెల్‌ తరహాలో రూపొందించాలని భావిస్తున్నాం. అక్టోబర్‌ తర్వాత షూటింగ్‌ మొదలవుతుంది. 2024లో మూవీ విడుదలయ్యే అవకాశం ఉంది. 30-35 శాతం షూటింగ్‌ పూర్తయింది. తదుపరి షెడ్యూల్‌ వచ్చే వారం స్టార్ట్‌ అవుతుంది’ అని ఆయన వెల్లడించారు.

Exit mobile version