Yash No to Pan Masala Ads: కోట్లు ఇస్తామన్నా ఆ పని చేయను-యశ్.!!

కేజీఎఫ్ సినిమా ద్వారా ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సూపర్ స్టార్ యష్ తాజాగా మరో సారి వార్తల్లో నిలిచాడు.

  • Written By:
  • Publish Date - April 30, 2022 / 11:59 PM IST

కేజీఎఫ్ సినిమా ద్వారా ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సూపర్ స్టార్ యష్ తాజాగా మరో సారి వార్తల్లో నిలిచాడు. ఈ సారి ఓ పాన్ మసాలా బ్రాండ్ కోసం కోట్లాది రూపాయల ఎండార్స్‌మెంట్ ఒప్పందాన్ని తిరస్కరించినట్లు అడ్వర్టయిజింగ్ ఏజెన్సీ ధృవీకరించింది. పొగాకు బ్రాండ్‌లో గత వారం అక్షయ్ కుమార్ నటించి అనంతరం క్షమాపణ చెప్పి ఆ ఒప్పందం నుంచి వైదొలిగిన అనంతరం ఇప్పుడు అదే బాటలో యష్ ఏకంగా ప్రతిపాదన దశలోనే ఒప్పందం దరిచేరనివ్వకుండా ఆదర్శంగా నిలిచాడు.

KGF చాప్టర్ 2 బాక్సాఫీస్ విజయాన్ని పురస్కరించుకుని, యష్ బ్రాండ్ ఇమేజ్ ను వాడుకోవాలని, ప్రముఖ పాన్ మసాలా బ్రాండ్ కోసం భారీ ఎండార్స్‌మెంట్ ఒప్పందంతో యష్ ను ముందు ఆఫర్ పెట్టింది. అయితే యువత ఆరోగ్యాన్ని పాడు చేసే పొగాకు ఉత్పత్తులకు తాను ఎండార్స్ చేయనంటూ యష్ తేల్చి చెప్పాడు. యష్ ఎండార్స్‌మెంట్ ఒప్పందాలను నిర్వహించే ఏజెన్సీ ఈ వార్తలను ధృవీకరించింది. యష్ ఎండార్స్‌మెంట్‌లను నిర్వహించే టాలెంట్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ హెడ్ అర్జున్ బెనర్జీ ఒక పత్రికా ప్రకటనలో ఈ విషయం తెలిపారు.

విమల్ కేసరి, యాలకుల ప్రొడక్టుల ప్రోమోల కోసం ఇప్పటికే అజయ్ దేవగన్, షారూఖ్ ఖాన్‌లు అడ్వర్టయిజ్ మెంట్ చేరాడు. కానీ సదరు విమల్ బ్రాండ్ పొగాకు ఉత్పత్తులను కూడా విక్రయిస్తుంది. అయితే ఇదే అడ్వర్టయిజ్ మెంట్ లో నటించిన అక్షయ్ తన అభిమానులకు క్షమాపణలు చెబుతూ అందులో నుంచి వైదొలిగాడు.

కానీ అటు షారుఖ్, అజయ్ దేవగన్‌లతో కలిసి కొత్త విమల్ పాన్ మసాలా ప్రకటనలో కనిపించగా, ఇరువురు సోషల్ మీడియాలో ఆగ్రహాన్ని ఎదుర్కొన్నారు. ఇదిలా ఉంటే పలువురు సినిమా స్టార్స్, అలాగే క్రికెటర్లు పొగాకు, మద్యం ఉత్పత్తుల బ్రాండ్లతో తమ అడ్వర్టయిజ్ మెంట్ కాంట్రాక్టులను రద్దు చేసుకున్నారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కోట్లాది రూపాయలు ఆఫర్ చేసినప్పటికీ, మద్యం, పొగాకు బ్రాండ్లకు అడ్వర్టయిజ్ మెంట్స్ చేయలేదు..!!