KGF 2 Box Office: బాలీవుడ్ లో కుమ్మేస్తోన్న కేజీఎఫ్ -2…వెనకబడిన హీరోపంతి, రన్ వే 34..!!

KGF2ఈ సినిమా దూకుడు ముందు ఇంకే సినిమా నిలవడం లేదు. అటు బాలీవుడ్ లో ఈ మూవీ దూసుకుపోతుంది.

  • Written By:
  • Publish Date - May 4, 2022 / 06:34 AM IST

KGF2ఈ సినిమా దూకుడు ముందు ఇంకే సినిమా నిలవడం లేదు. అటు బాలీవుడ్ లో ఈ మూవీ దూసుకుపోతుంది. మాస్ పిచ్చెక్కి థియేటర్లకు క్యూ కడుతుంటే..ఇప్పటికీ రోజుకు 10కోట్లు చొప్పున వసూలు చేస్తోంది. మూడు, నాలుగో వారం కేజీఎఫ్ 2 హవా ముందు ఇంకేదీ నిలవకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇక ఈద్ హాలిడేస్ పరిశీలిస్తే…హిందీ బెల్ట్ లో మూడు రోజుల్లో 21కోట్లతో కేజీఎఫ్ చాప్టర్ 2 స్పష్టంగా ఇతర సినిమాల్నిడామినేట్ చేసింది. కొత్త రిలీజ్ హీరోపంతి 2 ఆల్ ఇండియా 14.5కోట్లు వసూలు చేయగా…రన్ వే 34కోట్ల వసూళ్లతో వెనకబడ్డాయి. ఈ మధ్యే రిలీజైన ఈ రెండు సినిమాలు మూడోవారంలో ఆడుతున్న కేజీఎఫ్ 2ని డామినేట్ చేయడంలో చతికిలబడటం బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిగ్గా మారింది.

బడాస్టార్లు నటించిన రన్ వే 34 హీరోపంతి 2 ఫస్టు సోమవారం కేజీఎఫ్ 2 కంటే తక్కువ వసూళ్లు సాధించాయి. టిక్కెట్ కౌంటర్లల మంచి ఓపెనింగ్ పొందిన తర్వాత టైగర్ ష్రాఫ్ హీరోపంతి 2 దాని మొదటిసోమవారం కలెక్షన్లో భారీగా వెనకంజలో ఉంది. ఈ సినిమా సోమవారం రూ. 1.10కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఇక ఆదివారం కలెక్షన్ 4కోట్ల కంటే 72.5శాతం తక్కువ. అజయ్ దేవగన్ నటిస్తూ దర్శకత్వం వహించిన రన్ వే 34…హీరోపంతి 2 అదే రోజు రిలీజ్ అయ్యాయి. ఇందులో దేవగన్ సినిమా కొంచెం పర్వాలేదు అనిపించింది. రన్ వే 34 తొలి సోమవారం 2.25కోట్లు రాబట్టిందని బాలీవుడ్ నానాహంగామా చేసింది మొదటిరోజూ వసూళ్లు 3కోట్లు మాత్రమే కావడంతో సినిమా స్లోఅయ్యింది. రన్ వే34 హీరోపంతి 2 రెండూ యష్ కేజీఎఫ్ చాప్టర్ 2 నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటున్నాయి. ఇది ఇప్పుుడు మూడవ వారంలో బాగా నడుస్తోంది. అయినా కూడా హిందీ బెల్ట్ లో ఇంకా వసూళ్ల పరంగా వెనకంజలో ఉన్న సంకేతాలు కనిపించడం లేదు. సోమవారం ఈ సినిమా రన్ వే 34, హీరో పంతి 2 రెండింటి కంటే 3.75కోట్లు ఎక్కువగా రాబట్టింది. దీంతో హిందీ బెల్ట్ లో మూవీ మొత్తం కలెక్షన్ ఇప్పుడు 373.33కోట్లకు చేరుకుంది.

సినిమా ట్రేడ్ అనలిస్ట్ ఆదర్శ్ ట్విట్టర్లో ఇలా చెప్పుకొచ్చారు. “#KGF2 రెండవ అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ సినిమాగా అవతరించడానికి సిద్దంగా ఉంది. అలాగే #ఈద్ సెలవులు దాన్ని దూకుడు 400కోట్ల దిశగా వేగవంతం చేస్తాయి. ఆల్ టైం బ్లాక్ బస్టర్ శుక్రవాం 4.25కోట్లు , శనివారం 7.25కోట్లు ఆదివారం 9.27కోట్లు మొత్తం 373.33కోట్లు వసూలు చేసిందని వెల్లడించారు. 387.38 కోట్లను ఆర్జించిన అమీర్ ఖాన్ దంగల్ జీవితకాల కలెక్షన్ ను KGF 2 త్వరలోనే దాటవచ్చంటున్నారు. కానీ బాహుబలి ది కన్ క్లూజన్ 510.99 కోట్లు హిందీ వెర్షన్ జీవితకాల కలెక్షన్లను అధిగమించడం కొంచెం సవాల్ గా అనిపిస్తోందని సినీ విశ్లేషకులు అంటున్నారు.