Yash : య‌ష్‌ 19వ సినిమా అప్డేట్ వచ్చేసింది.. టైటిల్ ఏంటో తెలుసా? డైరెక్టర్ ఎవరంటే?

తాజాగా య‌ష్‌ 19వ సినిమా టైటిల్ ప్రకటిస్తూ ఓ వీడియోని కూడా రిలీజ్ చేశారు.

Published By: HashtagU Telugu Desk
Yash 19th Movie announced and Titled as Toxic

Yash 19th Movie announced and Titled as Toxic

రాకింగ్ స్టార్ యష్(Yash) KGF సినిమా తర్వాత ఏ సినిమాతో రాబోతున్నాడా అని సంవత్సరం నుంచి అభిమానులు, సినీ ప్రేమికులు ఎదురు చూస్తున్నారు. య‌ష్‌ 19 సినిమాపై అనేక వార్తలు వచ్చినా దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. ఇటీవలే రెండు రోజుల క్రితం య‌ష్‌ 19ని ప్రకటించి నేడు టైటిల్, మిగిలిన వివరాలు ప్రకటిస్తామని తెలిపారు.

తాజాగా య‌ష్‌ 19వ సినిమా టైటిల్ ప్రకటిస్తూ ఓ వీడియోని కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాని మలయాళ డైరెక్టర్ గీతూ మోహ‌న్ దాస్‌ తెరకెక్కిస్తుండగా KVN ప్రొడక్షన్స్ నిర్మాణంలో వెంక‌ట్ నారాయ‌ణ భారీ బ‌డ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకి ‘టాక్సిక్'(Toxic) అనే టైటిల్ ని ప్రకటించారు. దీనికి ‘ఏ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్స్ అప్స్‌’ అనే సబ్ టైటిల్ ని కూడా ప్రకటించారు.

ఈ వీడియో చూస్తుంటే య‌ష్‌ 19 సినిమా కూడా KGF లాగే భారీగా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. సినిమా టైటిల్ ని ప్రకటించడమే కాదు రిలీజ్ డేట్ ని కూడా అప్పుడే ప్రకటించేశారు చిత్రయూనిట్. 2025 ఏప్రిల్ 10న ఈ టాక్సిక్ సినిమాని రిలీజ్ చేస్తామని ప్రకటించారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. ఇక ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ అని వార్తలు వస్తున్నా దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. మొత్తానికి చాలా గ్యాప్ తర్వాత య‌ష్‌ 19 సినిమా ప్రకటించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 

  Last Updated: 08 Dec 2023, 12:47 PM IST