Site icon HashtagU Telugu

Bezawada Prasanna Kumar: అనసూయ ఇండస్ట్రీలో ఎన్నో కష్టాలు ఎదుర్కొంది : రచయిత ప్రసన్నకుమార్

Mixcollage 22 Feb 2024 07 25 Am 7391

Mixcollage 22 Feb 2024 07 25 Am 7391

తెలుగు ప్రేక్షకులకు ప్రముఖ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనసూయ ప్రస్తుతం చేతినిండా అవకాశాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు యాంకర్ గా తన సత్తాను చాటుతూ బుల్లితెర ప్రేక్షకులను అలరించిన అనసూయ ప్రస్తుతం నటిగా వరుసగా అవకాశాలను అందుకుంటూ వెండితెర ప్రేక్షకులను కూడా అలరిస్తూ క్షణం కూడా తీరిక లేకుండా ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది. కాగా అనసూయ నటిస్తున్న సినిమాలు అన్నీ కూడా మంచి హిట్ టాక్ ని సొంతం చేసుకుంటుండడంతో ఆమెకు వరుసగా అవకాశాలు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం అనసూయ చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి.

అయితే ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో వరుసగా అవకాశాలను అందుకుంటు దూసుకుపోతున్న అనసూయ ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలు ఎన్నో కష్టాలను ఎదుర్కొందట. అనసూయ ఇండస్ట్రీలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి కష్టాల గురించి చెప్పుకొచ్చారు సినీ రచయిత ప్రసన్నకుమార్. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సినీ రచయిత బెజవాడ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ.. ఎపిసోడ్ షూట్ కాగానే, మరో ఎపిసోడ్‌కి రాత్రి 7 గంటలకు వచ్చి 1 గంట వరకు రిహార్సల్ చేసేది. ఆమె భర్త బయట కారులో వెయిట్ చేసేవారు. ఒక కొత్త షో టెస్ట్ షూట్ కోసం అంతా ఫిక్స్ చేసుకున్నాము. షూట్ కి రెండు రోజుల ముందు అనసూయకి డెలివరీ అయ్యింది. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన మర్నాడు రెస్ట్ తీసుకుని మూడో రోజు షూట్‌కి వచ్చారు.

ఒక వైపు షూటింగ్‌లో పాల్గొంటూ ప్రతి అరగంటకి వెళ్లి బేబికి ఫీడింగ్ ఇస్తూ యాంకరింగ్ చేసింది. అలా ఎవరూ చేయలేరని ప్రసన్న కుమార్ చెప్పుకొచ్చారు. ఆ ఒక్కరోజు షూటింగ్ కోసం ఇప్పటి వరకు అనసూయ డబ్బులు అడగలేదు అని చెప్పుకొచ్చారు ప్రసన్న కుమార్ చెప్పారు. సోషల్ మీడియాలో చాలామంది ఆమె గ్లామర్ చూసి విమర్శలు చేస్తారు. కానీ ఆ కామెంట్స్ చూస్తే వాళ్లు చిన్నగా అనిపిస్తారు. అనసూయ అంత టఫ్ అమ్మాయిని తను ఇండస్ట్రీలో చూడలేదు. ఏ అబ్బాయి తనని ఫ్లర్ట్ చేయలేడు. చాలా స్ట్రాంగ్ ఉమెన్. తన వెనకాల ఉన్న స్ట్రగుల్ తెలిసిన వారు బ్యాడ్ కామెంట్స్ చేయరు. ఇండస్ట్రీలో అనసూయ నెగ్గుకురావడం వెనుక కష్టాలను చెబుతూ బెజవాడ ప్రసన్న కుమార్ ఎమోషనల్ అయ్యారు. ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.