Site icon HashtagU Telugu

World Television Day 2024: తిరుగులేని ‘ఠీవీ’.. విజువల్ మీడియాలో రారాజు

World Television Day 2024

World Television Day 2024: మనకెంతో ఇష్టమైన టెలివిజన్‌కు కూడా ఒక ప్రత్యేకమైన రోజు ఉంది. ఇవాళ (నవంబరు 21) ప్రపంచ టీవీ దినోత్సవం. సమాచార రంగంలో ఒక మహా విప్లవాన్ని తీసుకొచ్చిన సాధనం టీవీ. ఇది మనిషి ఆలోచనా తీరును, జీవన శైలిని, అభిప్రాయాలను ప్రభావితం చేసింది. దేశాల రాజకీయాల గతిని కూడా టీవీ మార్చింది. ఎందుకంటే ఇందులో ప్రసారమయ్యే వార్తలు, విశ్లేషణలు, ప్రకటనలు ఓటరు మహాశయుల మైండ్ సెట్‌ను ప్రభావితం చేస్తుంటాయి. వాస్తవానికి గత పదేళ్లుగా మన దేశంలో స్మార్ట్‌ఫోన్ వినియోగం, ఇంటర్నెట్ వినియోగం తారస్థాయిలో పెరిగింది. ఫలితంగా టీవీల(World Television Day 2024) విక్రయాలు చాలావరకు తగ్గిపోయాయి. అయినా టీవీ ఉనికి మాత్రం టూ టైర్ సిటీలు, గ్రామీణప్రాంతాల్లో సజీవంగానే ఉంది.