Site icon HashtagU Telugu

Chiranjeevi’s Heroines: ఆ హీరోయిన్ తో వర్క్ చేయడం ఎంతో థ్రిల్ ని ఇచ్చింది: చిరంజీవి

Chiru

Chiru

చిరంజీవి (Chiranjeevi) తన కెరీర్‌లో అనేక మంది హీరోయిన్స్ తో కలిసి పనిచేశారు. అయితే దివంగత నటి శ్రీదేవి (Sridevi) కి ఆయన మనసులో ప్రత్యేక స్థానం ఉంది. “నిజం విత్ స్మిత” అనే టాక్ షోలో ఇటీవల కనిపించిన సందర్భంగా శ్రీదేవితో కలిసి పనిచేయడం తనకు నిజంగా ఆనందదాయకమైన అనుభవం అని చిరంజీవి (Chiranjeevi) వెల్లడించారు. చిరంజీవి, శ్రీదేవి కలిసి “జగదేక వీరుడు అతిలోక సుందరి”, “ఎస్పీ పరశురామ్”, “మోసగాడు” వంటి అనేక చిత్రాలలో నటించారు.

తన అభిమాన హీరోయిన్ శ్రీదేవి గురించి టాక్ షోలో అడిగినప్పుడు, చిరంజీవి స్పందిస్తూ తాను పనిచేసిన ఒక్కొ హీరోయిన్ కు ఒక్కొ ప్రత్యేక క్వాలిటీస్ ఉన్నాయని అన్నారు. రాధిక (Radhika), రాధ, విజయశాంతితో కూడా కలిసి నటించడం ఆనందాన్ని ఇచ్చిందన్నారు. వాళ్లలో స్పాంటేనిటీ, డ్యాన్స్ స్కిల్స్ (Dance Skills) బాగున్నాయని అని మెగా స్టార్ చిరంజీవి మెచ్చుకున్నారు.

అనంతరం శ్రీదేవి గురించి మాట్లాడుతూ.. ఆమెతో డ్యాన్స్ చూడటం మరచిపోలేని అనుభూతి అని, ఆమెతో చేసినంతగా మరెవరితోనూ పని చేయలేదని  (Chiranjeevi) అన్నారు. ఇక శ్రీదేవి, చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి ఎవర్ గ్రీన్. ఇప్పటికే ఈ మూవీ టాలీవుడ్ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తోంది. ఇక మూవీకి కొనసాగింపు గా పార్ట్2 చూడాలని ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. అయితే అప్పట్లో రాంచరణ్, జాన్వీ కపూర్ కలిసి జగదేక వీరుడు అతిలోక సుందరి లాంటి సినిమా చేస్తారని వార్తలు కూడా హాల్ చల్ చేశాయి.

Also Read: Valentine’s Day Restrictions: హద్దుమీరుతున్న ప్రేమికులు.. NITC యూనివర్సిటీ కఠిన ఆంక్షలు

Exit mobile version