Actress Suhasini : ఈతరం సినిమాల్లో హీరోయిన్లను చూపించే తీరుపై ప్రముఖ నటి సుహాసిని కీలక వ్యాఖ్యలు చేశారు. తాము మెయిన్ రోల్స్ చేసిన టైంలో.. హీరోయిన్లు స్కిన్ షో చేయడానికి, ఇంటిమేట్ సీన్స్‌లో నటించడానికి బాగా ఇబ్బందిపడేవారని ఆమె చెప్పారు. తమ తరానికి చెందిన హీరోయిన్లు స్కిన్ షో సీన్లు ఉన్న సినిమాలకు నో చెప్పిన సందర్భాలు కూడా ఎక్కువే ఉన్నాయన్నారు. ఇప్పటి హీరోయిన్లు అవేం పట్టించుకోవడం లేదని సుహాసిని తెలిపారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read :Khamenei : ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఆరోగ్యం విషమం.. వారసుడిగా ముజ్తబా ఖమేనీ ?
‘‘2010 సంవత్సరం నుంచి సినిమాల మేకింగ్‌లో చాలా మార్పులు వచ్చాయి. పాశ్చాత్య పోకడలను ఇప్పుడు ఎక్కువగా ఫాలో అవుతున్నారు. ఫారిన్ సినిమాలకు ధీటుగా ఇక్కడి సినిమాలను ప్రజెంట్ చేసే ప్రయత్నంలో స్కిన్ షో, ఇంటిమేట్ సీన్ల సంఖ్యను పెంచుతున్నారు’’ అని సుహాసిని పేర్కొన్నారు. అయితే భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో సినిమాల్లో మహిళలను(Actress Suhasini) తక్కువ చేసి చూపించడం అనేది కొంత ఆందోళన కలిగిస్తోందన్నారు. సినిమా స్టోరీల్లో హీరోయిన్లకు స్ట్రాంగ్ రోల్స్ లేకుండా పోయిందని తెలిపారు.
Also Read :Mann ki Baat : ‘డిజిటల్ అరెస్ట్’లపై ప్రజలకు ప్రధాని మోడీ కీలక సూచనలు
తన మ్యారేజ్ గురించి సుహాసిని పలు కీలక విషయాలను వెల్లడించారు. మణిరత్నంతో తన మ్యారేజ్‌ను పెద్దలు కుదిర్చారని తెలిపారు. ఇష్టాలు, అభిప్రాయాలు, వృత్తి ఇలా ప్రతీ అంశంలో మణిరత్నం, తాను పరస్పరం గౌరవ భావంతో నడుచుకుంటామన్నారు. తమ మధ్య పెద్దగా గొడవలు జరగవని సుహాసిని స్పష్టం చేశారు. ఏవైనా చిన్నపాటి మనస్పర్థలు ఒకవేళ తలెత్తినా సర్దుకుపోతామని తేల్చి చెప్పారు. మణిరత్నం తీసే చాలా సినిమాలకు అవసరమైన వర్క్‌ను తాను చేసి పెడుతుంటానన్నారు. ‘రోజా’, ‘తిరుడా తిరుడా’, ‘ఇరువర్’, ‘రావణ’ చిత్రాలకు తాను డైలాగ్‌లు రాసి పెట్టానని సుహాసిని గుర్తు చేసుకున్నారు.