Salman Khan: వచ్చే ఈద్ కోసం.. సల్లూ మరో మూవీ రెడీ.. టైగర్-3 షూటింగ్ పూర్తి!!

దీపావళి వేళ లడ్డూ ఎంత ముఖ్యమో.. రంజాన్ వేళ ఏటా బ్లాక్ బస్టర్ మూవీ హిట్ ను ఇవ్వడం కండల వీరుడు సల్లూ భాయ్ కు అంత అలవాటు.

Published By: HashtagU Telugu Desk
Salman Imresizer

Salman Imresizer

దీపావళి వేళ లడ్డూ ఎంత ముఖ్యమో.. రంజాన్ వేళ ఏటా బ్లాక్ బస్టర్ మూవీ హిట్ ను ఇవ్వడం కండల వీరుడు సల్లూ భాయ్ కు అంత అలవాటు. అయితే ఈసారి రంజాన్ పండుగకు సల్లూ భాయ్ మూవీ రిలీజ్ కాలేదు. అంత మాత్రాన సల్లూ యాక్టివిటీ ఆగిందని చెప్పలేం. వచ్చే ఏడాది ఈద్ కోసం .. ఇప్పుడే ఒక సినిమాను సల్లూ రెడీ చేశాడు. దానిపేరే ” టైగర్ -3″.

తాజా అప్ డేట్ ప్ర‌కారం ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. 2023 ఏప్రిల్ 21న ఇది రిలీజ్ అవుతుంది. మ‌నీశ్ శ‌ర్మ డైరెక్ష‌న్‌లో స‌ల్మాన్ ఖాన్-క‌త్రినాకైఫ్, ఇమ్రాన్ హ‌ష్మీ ప్ర‌ధాన పాత్ర‌ల్లో ఇది వస్తోంది. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల అవుతుంది. దీనికి సంబంధించిన టీజర్ లో సల్మాన్, కత్రినా యాక్షన్ తో దుమ్ము లేపారు.

తెలుగు హీరో విక్ట‌రీ వెంక‌టేశ్ కూడా ఈ చిత్రంలో క‌నిపించ‌బోతున్నాడ‌న్న క్రేజీ న్యూస్ ఇపుడు హాట్ టాపిక్‌గా మారిపోయింది. స‌ల్మాన్‌, వెంకీ సిల్వ‌ర్ స్క్రీన్‌పై క‌నిపించేది నిజ‌మే అయితే మూవీ ల‌వ‌ర్స్ కు గుడ్ న్యూస్ అన్న‌మాటే. మ‌రి దీనిపై వెంకీ కానీ స‌ల్లూభాయ్ కానీ ఏమైనా స్పందిస్తారేమో చూడాలి. ఇదొక్కటే కాకుండా.. భజరంగీ భాయిజాన్‌ సినిమాకి సల్మాన్‌ సీక్వెల్‌ను ప్రకటించారు. త్వరలో కిక్‌ 2ను సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు.

  Last Updated: 04 May 2022, 10:11 PM IST