RRR Beat Rajini Record: జపాన్ లో ఆర్ఆర్ఆర్ క్రేజ్.. రజనీ రికార్డు బ్రేక్?

ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాను బ్రేక్ చేస్తుందా? అనే ప్రశ్న ఆసక్తిని రేపుతోంది.

Published By: HashtagU Telugu Desk
Rrr Movie Ticket Rates

Rrr Movie Ticket Rates

ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాను బ్రేక్ చేస్తుందా? అనే ప్రశ్న ఆసక్తిని రేపుతోంది. రాజమౌళి గ్లోబల్ బ్లాక్‌బస్టర్ ‘RRR’ జపాన్‌లో సైతం సినీ ప్రేమికులను థ్రిల్ చేయడానికి సిద్ధంగా ఉంది. ల్యాండ్ ఆఫ్ ది రైజింగ్ సన్‌లో RRRని ప్రమోట్ చేస్తోంది టీం. జపాన్ ప్రేక్షకులతో పాటు అక్కడి భారతీయుల కోసం ఈ చిత్రాన్ని జపాన్‌లో విడుదల చేశారు.

అక్టోబర్ 21న జరిగే చిత్ర ప్రీమియర్ కోసం SS రాజమౌళితో పాటు ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇప్పటికే జపాన్‌కు వెళ్లారు. జపాన్‌లో అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రం గా 1995లో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ముత్తు నిలిచింది. అక్కడ దాదాపు ¥400M అంటే దాదాపు 22 కోట్లు వసూలు చేసింది. బాహుబలి ¥365M, 3 ఇడియట్స్ ¥149M వసూలు చేసింది. శ్రీదేవి ఇంగ్లీష్ వింగ్లీష్, ప్రభాస్ సాహో కూడా టాప్ 5 లో ఉన్నాయి. RRR 1995 చిత్రం ముత్తు రికార్డును బ్రేక్ చేసి జపాన్‌లో అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రంగా అవతరించగలదా అనేది ఆసక్తికరంగా మారింది. జపాన్‌లో రజనీకాంత్‌కు ఉన్న క్రేజ్ అసమానమైనది. ఇక ఆర్ఆర్ఆర్ క్రేజ్ కూడా ఆ స్థాయిలోనే ఉంది. దీంతో రజనీకాంత్ రికార్డును RRR బ్రేక్ చేసే అవకాశం ఉందని జపాన్ ఫ్యాన్స్ అంటున్నారు.

  Last Updated: 21 Oct 2022, 03:49 PM IST