అక్రమ నిర్మాణాలపై కాంగ్రెస్ సర్కార్ ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా హైదరాబాద్ (Hyderabad) నగరంలో చెరువులు కబ్జా చేసి కట్టిన నిర్మాణాలను తొలగిస్తూ వస్తుంది. తాజాగా గండిపేట పరిధిలోని ఆక్రమణలపై దృష్టి సారించిన హైడ్రా.. అక్కడి అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసేస్తోంది. ఈ క్రమంలో కింగ్ నాగార్జున (Nagarjuna) కు సంబదించిన కట్టడాలను కూడా హైడ్రా తొలగించబోతుందనే వార్తలు ఫిలిం సర్కిల్లో వినిపిస్తుంది. తమ్మిడి చెరువులో 3 ఎకరాల 30 గుంటలను ఆక్రమించి నాగార్జున ఎన్ కన్వెన్షన్ (N Convention) సెంటర్‌ను నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదు వచ్చాయి.
We’re now on WhatsApp. Click to Join.
ఎఫ్‌టీఎల్‌లో నిర్మించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను కూల్చివేయాలని హైడ్రా కమిషనర్‌కు జనం కోసం అనే సంస్థ ఫిర్యాదు చేసింది. గతంలో కూడా పిర్యాదులు చేసినప్పటికీ..అప్పటి ప్రభుత్వం చూసి చూడనట్లు వ్యవహరించిందని..ఇప్పుడు మాత్రం ఈ అక్రమ కట్టడాలను కూల్చేయాలని అంటున్నారు. మరి ఫిర్యాదుల మేరకు కూల్చేస్తారా..? లేక చూసి చూడనట్లు ఉంటారా..? అనేది చూడాలి. ప్రస్తుతం మాత్రం హైడ్రా అక్రమ నిర్మాణాల విషయంలో ఎక్కడ తగ్గడం లేదు. వెనుక ఎంత పెద్ద వారు ఉన్న చూడడంలేదు. తమ పనిమేరకు కూల్చేస్తు పోతుంది.
Read Also : Jay Shah : ఐసీసీ నూతన చైర్మన్‌గా జై షా నియామకం..!