AshwiniDutt : ఈ సినిమా తీసి సినిమా కెరీర్ కు ఫుల్ స్టాప్ పెడతా..!!

అశ్వనీదత్...టాలీవుడ్ లో ఒక సుదీర్ఘకాలం పయనించిన నిర్మాత. దశాబ్దాల తన కెరీర్ లో ఎన్నో విజయవంతమైన సినిమాలు నిర్మించారు.

Published By: HashtagU Telugu Desk
Ashwini Dutt

Ashwini Dutt

అశ్వనీదత్…టాలీవుడ్ లో ఒక సుదీర్ఘకాలం పయనించిన నిర్మాత. దశాబ్దాల తన కెరీర్ లో ఎన్నో విజయవంతమైన సినిమాలు నిర్మించారు. అశ్వనీదత్ నిర్మించిన తాజా చిత్రం సీతారామం కూడా మంచి విజయాన్ని సాధించింది. ఈ సందర్బంగా ఆయన ఓ ఇంటర్వూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. జగదేకవీరుడు అతిలోక సుందరి-2 మూవీ తీసి తన కెరీర్ కు ముగింపు పెడతానని చెప్పారు.

నిర్మాతగా సినీరంగం అడుగుపెట్టినప్పుడు రూ. 16లక్షలతో మూవీ తీశానని గుర్తు చేసుకున్నారు. అల్లుఅరవింత్ తో కలిసి చూడాలని ఉంది సినిమాను హిందీలో రీమేక్ చేసినట్లు చెప్పారు. ఈ మూవీ వల్ల చెరో…రూ. 6కోట్లు పోగోట్టుకున్నట్లు చెప్పుకొచ్చారు. స్టూడెంట్ నెంబర్ 1 సినిమాలో మొదట ప్రభాస్ ను హీరోగా అనుకున్నప్పటికీ…చివరకు ఎన్టీఆర్ ను ఓకే చేయాల్సి వచ్చిందన్నారు. ఓటీటీ అనేది సినిమాకు చాలా ప్రమాదకరమని తాను భావించడం లేదన్నారు. సినిమాను ప్రదర్శించేందుకు అదొక ప్రత్యామ్నాయ మార్గమే అన్నారు. యూట్యూబ్ తన దృష్టిలో చాలా ప్రమాదకరమని చెప్పారు అశ్వనీదత్.

  Last Updated: 12 Aug 2022, 07:53 PM IST