Rajamouli: భారతీయ సినీ పరిశ్రమలో తన అద్భుతమైన చిత్రాలతో అంతర్జాతీయ ఖ్యాతి పొందిన అగ్ర దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి (Rajamouli) మరోసారి తీవ్ర చర్చనీయాంశమయ్యారు. ఈసారి ఆయన సినిమాల కారణంగా కాకుండా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు, ఆయన కొత్త ప్రాజెక్ట్ టైటిల్‌పై తలెత్తిన అభ్యంతరాల కారణంగా వార్తల్లో నిలిచారు.
హనుమాన్‌పై వ్యాఖ్యలు, ఆన్‌లైన్‌లో మిశ్రమ స్పందన
తాజాగా వారణాసి టైటిల్ లాంచ్ కార్యక్రమంలో రాజమౌళి పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన హనుమంతుడిని ఉద్దేశించి చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద వివాదానికి దారితీశాయి. ఆయన కామెంట్లపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు ఆయన వ్యాఖ్యలను సమర్థిస్తూ కొందరు స్పందిస్తుంటే, మరికొందరు మాత్రం ఆయన వ్యాఖ్యలు అభ్యంతరకరమని, వాటిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఆన్‌లైన్‌లో పెద్ద ఎత్తున ట్రోలింగ్ కూడా జరుగుతోంది.
Also Read: Jamal Khashoggi: ఎవరు ఈ జమాల్ ఖషోగ్గీ? ఆయన హత్యకు కారణాలు ఏమిటి?
టైటిల్‌పై కొత్త వివాదం
ఇదిలా ఉండగా రాజమౌళి.. మహేశ్ బాబుతో చేసే సినిమాకు ‘వారణాసి’ అనే టైటిల్‌ను ప్రకటించారు. అయితే ఈ టైటిల్‌పై ఒక యువ సినీ బృందం అభ్యంతరం వ్యక్తం చేస్తూ ముందుకు వచ్చింది. ‘వారణాసి’ అనే టైటిల్‌ను తాము తమ సినిమా కోసం రిజిస్టర్ చేసుకున్నామని, రాజమౌళి ఆ టైటిల్‌ను ఉపయోగించడం సరికాదని వారు పేర్కొంటున్నారు. ఈ వివాదం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయంగా మారింది. రాజమౌళి లాంటి అగ్ర దర్శకుడు చిన్న ప్రాజెక్టుల టైటిల్‌ను వాడడం సరైన పద్ధతి కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం సోషల్ మీడియాలో రాజమౌళి వ్యాఖ్యలు, టైటిల్ వివాదంపై చర్చలు, వాదోపవాదాలు తీవ్రమవుతున్నాయి. దేశవ్యాప్తంగా సినీ అభిమానులు, భక్తుల దృష్టి ఇప్పుడు రాజమౌళిపైనే ఉంది. ఈ ఆరోపణలు, అభ్యంతరాలపై ఆయన అధికారికంగా స్పందిస్తారా? లేక ప్రస్తుతానికి మౌనం పాటిస్తారా? అనేది చూడాలి. రాజమౌళి వివరణ కోసం అంతా ఎదురుచూస్తున్నారు.
