Site icon HashtagU Telugu

Balayya Reddy Sentiment: బాలయ్య ‘రెడ్డి’ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా!

Reddy

Reddy

నందమూరి బాలకృష్ణ – గోపీచంద్ మలినేని – మైత్రీ మూవీ మేకర్స్ #NBK107 మూవీ టైటిల్ ప్రకటించకముందే సినిమాపై మంచి క్రేజ్ ఉంది. కర్నూలులోని చారిత్రాత్మక కొండారెడ్డి బురుజు వేదిక గా చిత్రయూనిట్  టైటిల్ అనౌన్స్ చేసింది. అంతకుముందు ‘రెడ్డి గారు, అన్న గారు, వీర సింహారెడ్డి, జై బాలయ్య’ లాంటి టైటిల్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. సమర సింహారెడ్డి, చెన్న కేశవ రెడ్డి తదితర సినిమాలు బాలకృష్ణ కు మాస్ క్రేజ్ తీసుకొచ్చాయి. దీంతో బాలయ్య  రెడ్డి సెంటిమెంట్‌ను కొనసాగిస్తాడని మరోసారి రుజువవుతోంది.

‘వీరసింహారెడ్డి’ అనే టైటిల్ ప్రకటించి ఆసక్తి రేపాడు. గోపీచంద్ మలినేని ‘క్రాక్‌’తో తన కెరీర్‌లో ఉత్తమ చిత్రాన్ని అందించాడు. ఇక బాలయ్యతోనూ అంతకుమించి హిట్ కొట్టాలని భావిస్తున్నాడు గోపిచంద్. బాలయ్య సినిమాలు సంక్రాంతికి సందడి చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీ కూడా సంక్రాంతి బరిలో నిలుస్తోంది. మెగాస్టార్ మూవీ కూడా సంక్రాంతికి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. మరి సంక్రాంతి ఫైట్ లో బాలయ్య అందుకుంటాడా? అనేది వేచి చూడాల్సిందే!

Exit mobile version