Site icon HashtagU Telugu

Trivikram: మౌనమేలనోయి.. మాటల మాంత్రికుడా!

Trivikram

Trivikram

డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ తో ఉన్న బాండింగ్ గురించి అందరికీ తెలిసిందే. వాళిద్దరి కాంబినేషన్ లో జల్సా, అత్తారింటిదారేదీ లాంటి హిట్స్ ఉన్నాయి. తాజాగా భీమ్లానాయక్ మూవీకి కూడా డైలాగ్ రైటర్ గా వ్యవహరించడమే కాకుండా.. సినిమాను వెనకుండి నడిపించాడు. అయితే నిన్న బుధవారం జరిగిన ప్రిరిలీజ్ ఈవెంట్ లో త్రివిక్రమ్ ఎక్కడా కనిపించలేదు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాల్సిందిగా కేటీఆర్‌ను పవన్ స్వయంగా ఆహ్వానించడం ఆశ్చర్యకరం. కేటీఆర్ వచ్చారు కానీ.. త్రివిక్రమ్ మాత్రం రాలేదు. ఆరా తీస్తే, బండ్ల గణేష్ ఫోన్ కాల్ లీక్ కావడంతో త్రివిక్రమ్ విసిగిపోయాడని, వేదికపైకి రాగానే పవన్ అభిమానులు ‘బండ్లన్నా.. బండ్లన్నా’ అని అరుస్తారేమోనని అనుమానిస్తున్నారని ఆ వర్గాలు చెబుతున్నాయి. అలా చేయమని బండ్ల గణేష్ ఫోన్ కాల్ లో పవన్ అభిమానులను రెచ్చగొట్టిన సంగతి తెలిసిందే.

కాబట్టి ఈ రకమైన అవమానాన్ని ఫేస్ చేయలేకపోవడమే మంచిదని భావించారట. ఈవెంట్ కూడా సౌకర్యవంతంగా జరగడం కోసమే స్టేజీ వెనుక మాత్రమే కూర్చున్నాడు. కేటీఆర్‌ను పలకరించడానికి మాత్రమే వేదికపైకి వచ్చిన ఆయన వెంటనే వెళ్లిపోయారు. మాటల మాంత్రికుడు అనే ట్యాట్ ఉన్నా.. ప్రసంగం ఇవ్వడానికి మాత్రం ఇష్టపడలేదు. ఇక యాంకర్ సుమ కూడా అతన్ని పిలవలేదు. మాట్లాడమని బలవంతం చేయలేదు. అంటే త్రివిక్రమ్ నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని అర్థం. తాజాగా బండ్ల గణేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ మధ్య జరిగిన టగ్ ఆఫ్ వార్ త్రివిక్రమ్ గురించి మాట్లాడుతున్నప్పుడు బండ్ల అత్యంత చెత్త పదాన్ని ఉపయోగించడంతో ఫోన్ కాల్ లీక్‌ ఇష్యూగా మారింది. అయితే ఓ విషయంలో త్రివిక్రమ్, బండ్ల గణేష్ మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయని. ఇప్పుడు అది కొత్త మలుపు తిరిగి పోటీ మరింత పెద్దదైంది అని టాలీవుడ్ టాక్.

Exit mobile version