Rajamouli దర్శకధీరుడు రాజమౌళి గురించి నెట్ ఫ్లిక్స్ ఒక ప్రయోగాత్మక Modern Series డాక్యుమెంటరీ తీసింది. ఈమధ్యనే ఆ డాక్యుమెంటరీ రిలీజ్ కాగా అందుకోసం రాజమౌళితో పనిచేసిన హీరోలంతా కూడా ఆయన గురించి చెబుతూ వచ్చారు. సినిమా అంత పర్ఫెక్ట్ గా రావడానికి రాజమౌళి ఎంత కష్టపడతాడు.. హీరోలను ఎంత కష్టపెడతాడు అన్నది వారి మాటల్లో చెప్పారు. రాజమౌళి ఒక పని రాక్షసుడని చెబితే.. రాజమౌళి దగ్గర ఎలాంటి పనిముట్లు లేకుండా చేస్తామని కొందరు అన్నారు.
ఐతే రాజమౌళి తీసిన సినిమాల వల్ల ఆయనకు ఇంటర్నేషనల్ లెవెల్ లో ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ముఖ్యంగా హాలీవుడ్ డైరెక్టర్స్ కూడా రాజమౌళి టేకింగ్ ని మెచ్చుకుంటున్నారు. రాజమౌళి డాక్యుమెంటరీ నెట్ ఫ్లిక్స్ లో రీసెంట్ గా రిలీజ్ కాగా దాన్ని మన దగ్గర కన్నా హాలీవుడ్ ఆడియన్స్ ఎక్కువ చూస్తున్నారు.
అసలు తెలుగు ఆడియన్స్ అయితే ఈ డాక్యుమెంటరీని పట్టించుకోవడం మానేశారు. ఐతే తెలుగులో ఈ డాక్యుమెంటరీకి సెపరేట్ డబ్బింగ్ చెప్పించడం వల్ల మన స్టార్స్ అది కూడా తెలుగు వేరే వాళ్ల గొంతుతో వినాలంటే కాస్త ఇబ్బంది పడుతున్నారు. ఐతే నెట్ ఫ్లిక్స్ (Netflix,) ఒరిజినల్ గా వచ్చిన రాజమౌళి డాక్యుమెంటరీ మూవీ ఇండియన్ సినీ లవర్స్ ని అలరించలేదు కానీ హాలీవుడ్ ఆడియన్స్ మాత్రం ఈ డాక్యుమెంటరీని తెగ చూస్తున్నారు.
రాజమౌళి తన నెక్స్ట్ సినిమా మహేష్ తో చేయబోతున్నాడు. ఆ సినిమా పనుల్లో బిజీగా ఉన్న జక్కన్న సినిమాను త్వరలోనే సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నాడు. మహేష్ కూడా ఈ సినిమా కోసమే తన లుక్ ని మార్చేస్తున్నాడు. ఇప్పటికే జుట్టు గడ్డెం పెంచుకుని కనిపిస్తున్నాడు. ఈ సినిమా ఈ ఇయర్ ఎండింగ్ కల్లా సెట్స్ మీదకు వెళ్లే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది.
Also Read : Nani : నాని యాక్టర్ కాకపోతే ఏమయ్యేవాడో తెలుసా..?