Site icon HashtagU Telugu

Pawan Kalyan : ‘జానీ’ తరువాత పవన్ దర్శకత్వంలో ‘సత్యాగ్రహి’ సినిమా.. ఏమైంది మరి?

Why Pawan Kalyan Sathyagrahi Movie Shelved

Why Pawan Kalyan Sathyagrahi Movie Shelved

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటుడు మాత్రమే కాదు.. రచయిత, దర్శకుడు, డాన్స్ అండ్ ఫైట్ కొరియోగ్రాఫర్ డ్యూటీస్ కూడా చేసి ఆడియన్స్ ని అలరించారు. ఇప్పుడంటే రాజకీయాలు, సినిమాలు అని తిరుగుతున్నాడు కానీ ఒకప్పుడు మాత్రం పూర్తిగా సినిమాలపైనే దృష్టి ఉండేది. ఖుషీ, గుడుంబా శంకర్ సినిమాల్లో కొన్ని సీన్స్ కి దర్శకత్వం వహించిన పవన్ కళ్యాణ్.. చిరంజీవి నటించిన డాడీ సినిమాలో కూడా కొన్ని సీక్వెన్స్ ని తెరకెక్కించారు. అనంతరం దర్శకుడిగా సినిమా చేయాలని నిర్ణయం తీసుకోని ‘జానీ'(Johnny)ని తెరకెక్కించారు.

ఖుషీ తరువాత పవన్ చేస్తున్న సినిమా కావడం, దర్శకుడు కూడా తానే కావడంతో మూవీ పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. కానీ 2003 లో రిలీజైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ గా నిలిచింది. అయితే జానీ చిత్రీకరణ సమయంలోనే పవన్.. ‘సత్యాగ్రహి’ అనే సినిమా చేయడానికి కూడా సిద్ధమయ్యారు. ఆ చిత్రాన్ని కూడా తానే డైరెక్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఖుషీ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం నిర్మాణంలో ఏ ఆర్ రెహమాన్ సంగీతం, పిసి శ్రీరామ్ సినిమాటోగ్రఫీతో మూవీని అనౌన్స్ చేసి గ్రాండ్ గా లాంచ్ చేశారు.

అయితే జానీ ప్లాప్ అవ్వడంతో పవన్ కళ్యాణ్.. తన దర్శకత్వ ప్రతిభపై సందేహ పడ్డారట. జానీ సినిమా వల్ల నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ భారీగా నష్టపోయారు. అది దృష్టిలో పెట్టుకొనే పవన్.. తన వల్ల మరో నిర్మాత నష్టపడకూడని ‘సత్యాగ్రహి’ సినిమాని ఆపేశారట. ఈ విషయాన్ని ఏఎం రత్నం ఓ సందర్భంలో తెలియజేశారు.

ఇక సత్యాగ్రహి కథ విషయానికి వస్తే.. ఎమర్జన్సీ కాలం సమయంలో లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకోని ఓ పొలిటికల్ కథని అనుకున్నారు. ఆ మూవీలో పవన్ కళ్యాణ్‌ది స్టూడెంట్ లీడర్ పాత్ర. ఈ సినిమా గురించి పవన్ 2021 లో ఓ పొలిటికల్ మీటింగ్ లో మాట్లాడుతూ.. ఆ మూవీలో అనుకున్న విషయాలను బయట చేయాలనే ఉద్దేశంతో అప్పుడు ఆ చిత్రం ఆపేశాను. అందుకే ఇప్పుడు జనసేనగా మీ ముందుకు వచ్చానని చెప్పుకొచ్చారు.

 

Also Read : Balakrishna : ‘హనుమాన్’ కోసం వచ్చిన బాలయ్య.. సినిమా చూసి ఏమన్నారంటే?