National Cinema Day ఏదైనా ఒక ఫెస్టివల్ ఉంది అంటే అది ఆ తేదీన వస్తుందని ఫిక్స్ అవుతారు. జనవరి నుంచి డిసెంబర్ వరకు కొన్ని ప్రత్యేకమైన తేదీల్లో కొన్ని ప్రత్యేకమైన పండుగలు, విశేషాలు జరుపుకుంటారు. పండుగలు, ప్రత్యేకమైన సందర్భాలే కాకుండా కొన్ని కేటాయించిన డేట్స్ లో సంబంధించిన పండుగలని జరుపుకుంటారు. ఎక్సాంపుల్ గా చెప్పుకుంటే జనవరిలో 12 నుంచి 15 వరకు సంక్రాంతి ఉంటుంది. అక్టోబర్ లో దసరా.. డిసెంబర్ 25 క్రిస్మస్ ఇలా ఆయా పండుగలకు ప్రత్యేకమైన రోజు ఉంటుంది.
కానీ కొన్ని కార్యక్రమాలకు మాత్రం ఒక తేదీ అంటూ ఉండదు కాలంలో మార్పులకు అనుగుణంగా పండుగలు వస్తుంటాయి. ముఖ్యంగా రంజాన్ మాసం ఒక్కోసారి ముందుకు ఒక్కోసారి వెనక్కి వస్తుంది. ఈ క్రమంలోనే కొన్ని విశిష్టమైన తేదీల్లో మార్పులు కూడా ఆ సంబంధిత కార్యక్రమాలను కూడా మార్చాల్సి ఉంటుంది.
ఇక అసలు విషయంలోకి వస్తే సినిమా థియేటర్ యజమానులందరు కలిసి చేసుకునే నేషనల్ సినిమా డే అని ఒకటి ఉందన్న విషయం తెలిసిందే. ప్రేక్షకులకు సినిమా ఎక్స్ పీరియన్స్ ని అతి తక్కువ ధరకే అందించేలా సినిమా డే గా ఆ రోజు థియేటర్ యాజమాన్యం వారి ప్రాఫిట్స్ లాసులను పక్కన పెట్టి ప్రేక్షకులకు సినిమా చూపిస్తారు. నేషనల్ సినిమా డే సందర్భంగా రెగ్యులర్ గా 200 300 చార్జ్ చేసే మల్టీప్లెక్స్ లు కూడా 99 రూపాయలకే సినిమా చూసే అవకాశం కల్పిస్తారు.
అయితే ఈ నేషనల్ సినిమా డే (National Cinema Day) ప్రతి ఏడాది జరుపుకుంటారు కానీ ఒక ప్రత్యేకమైన డేట్ అంటూ దీనికి ఉండదు. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 23న నేషనల్ సినిమా డే జరుపుకున్నారు. ఈ ఏడాది అది అక్టోబర్ 13న నిర్వహించాలని అనుకున్నారు. ఇలా ప్రతి ఏదాది ఏదో ఒక డేట్ కాకుండా దీనికి కూడా ఒక డేట్ ఫిక్స్ చేయాలని థియేటర్ యాజమాన్యాలు అనుకుంటున్నాయి. నేషనల్ సినిమా డే రోజు మల్టీప్లెక్స్ లో కూడా అతి తక్కువ ధరలో సినిమాను ఎక్స్ పీరియన్స్ చేసే అవకాశం ఉంటుంది. మరి నేషనల్ సినిమా డే ప్రతి ఏడాది డేట్ మారకుండా ఒకే డేట్ లాక్ చేస్తే బెటర్ అని చెప్పొచ్చు.
Also Read : Rakshith Shetty : ఎన్టీఆర్ ని డైరెక్ట్ చేస్తానంటున్న రక్షిత్..!