జూనియర్ ఎన్టీఆర్(Jr NTR), దర్శకుడు మెహర్ రమేష్(Mehar Ramesh) కలయికలో వచ్చిన సోషియో ఫాంటసీ మూవీ శక్తి (Sakti). సి అశ్వినీదత్ నిర్మించిన ఈ భారీ బడ్జెట్ మూవీ.. 2011లో భారీ అంచనాలు మధ్య రిలీజ్ అయ్యి డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా ఎన్టీఆర్ అభిమానులకు ఒక పీడ కల లాంటిది. ఈ మూవీ కంటే ముందు మెహర్ రమేష్, ఎన్టీఆర్ తో ‘కంత్రి’ వంటి మాస్ యాక్షన్ ఫిలిం తెరకెక్కించాడు. ఆ మూవీ పర్వాలేదనిపించింది. ఆ తరువాత ప్రభాస్ తో తెరకెక్కించిన ‘బిల్లా'(Billa)ని కూడా స్టైలిష్ యాక్షన్ గా తెరకెక్కించి సూపర్ అనిపించాడు మెహర్.
దీంతో శక్తి పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు అభిమానులు. హాలీవుడ్ రేంజ్ లో ఒక మూవీ రాబోతుందని అని అనుకున్నారు. కానీ థియేటర్ లో మొత్తం సీన్ రివర్స్ అయ్యింది. నిజానికి మెహర్ కూడా హాలీవుడ్ మూవీ ‘మిషన్ ఇంపాజిబుల్’ లాంటి సినిమా చేయాలనే మొదలు పెట్టాడు. అసలు ముందు రాసుకున్న కథ వేరు. కంత్రి తరువాత మెహర్ రమేష్ నిర్మాత అశ్వినీ దత్ దగ్గరకి వచ్చి ఒక స్పై యాక్షన్ మూవీ చెప్పాడట. ఆ కథ నచ్చడంతో నిర్మాత కూడా ఓకే చెప్పేశాడు. ఎన్టీఆర్ నుంచి కూడా మూవీకి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. బెటర్ ఒపీనియన్ కోసం మెహర్ తన స్నేహితులైన అల్లు అర్జున్ అండ్ వివి వినాయక్ కూడా కథ వినిపించి సలహాలు తీసుకున్నాడట.
Bhola Shankar: భోళాజీ.. ప్రమోషన్స్ ను షురూ చేయండిజీ
ఇక్కడ వరకు అంతా ఓకే. అయితే ఈ మూవీ కంటే ముందు ఎన్టీఆర్ ‘బృందావనం’ కోసం డేట్స్ ఇవ్వాల్సి వచ్చింది. దీంతో ఈ సినిమాకి కొంచెం గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ లో అశ్వినీ దత్ కి ఒక ఆలోచన వచ్చింది. ఎన్టీఆర్ తో ‘జగదేక వీరుడు’, ‘పాతాళ భైరవి’ లాంటి సోషియో ఫాంటసీ మూవీ తీస్తే బాగుంటుందని భావించి.. ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ రచయితలను పిలిపించారు. చివరిగా మెహర్ రమేష్ కథలో మార్పులు చేసి శక్తి కథని రాశారు. నిజానికి సినిమా విషయంలో ఇదే పెద్ద తప్పు అయ్యింది. మూవీ ఫస్ట్ హాఫ్ అంతా స్పై యాక్షన్ మూవీలా ఉంటే, సెకండ్ హాఫ్ నుంచి సోషియో ఫాంటసీగా కనిపిస్తుంది. ఇలా ఫస్ట్ హాఫ్‌కి, సెకండ్ హాఫ్‌కి సంబంధం లేకుండా సినిమా ఉండడమే డిజాస్టర్ కి కారణమైందని అంటారు.