Jhund Producer: ‘ది కశ్మీర్ ఫైల్స్’ పై ‘బిగ్ బీ’ ఫైట్!

హిందీ పండిట్ల నేపథ్యంలో వచ్చిన కాశ్మీర్ ఫైల్స్ దేశవ్యాప్తంగా ప్రేక్షకలను ఆకట్టుకుంటోంది.

  • Written By:
  • Updated On - March 19, 2022 / 05:58 PM IST

హిందీ పండిట్ల నేపథ్యంలో వచ్చిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ మూవీ దేశవ్యాప్తంగా ప్రేక్షకలను ఆకట్టుకుంటోంది. చాలా రాష్ట్రాలు పన్ను మినహించాయి. కొన్ని రాష్ట్రాలు సినిమా చూసేందుకకు ఉచిత ప్రదర్శనలు, సెలవులను కూడా ప్రకటించాయి. అయితే ఈ విషయం అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఝుండ్‘ నిర్మాతలలో ఒకరైన సవితా రాజ్ హిరేమత్‌ను ‘ఆశ్చర్యానికి గురిచేసింది’. స్ట్పోర్ట్ డ్రామాగా, సందేశాత్మకతతో కూడిన మా చిత్రానికి టాక్స్ ను  ఎందుకు మినహాయింలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ చిత్రం కూడా ప్రేక్షకుల అభిమానాలను చూరగొందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

మార్చి 4న విడుదలైన ‘ఝుండ్’ అద్భుతమైన సినిమాగా పేరు తెచ్చుకుంది. అయితే, ఒక వారం తర్వాత, వివేక్ అగ్నిహోత్రి ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా విడుదలై ‘ఝుండ్’ సినిమాపై నీలినీడలు కమ్ముకునేలా చేసింది. కశ్మీర్ ఫైల్స్ కు కేంద్ర,  ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ప్రకటించాయి. సినిమా బాగా ఆడేందుకు ట్యాక్స్ ను మినహాయించాయి. దీంతో ఝుండ్ నిర్మాత సవితా రాజ్ హిరేమత్ రియాక్ట్ అయ్యారు. ప్రభుత్వాలు తమ చిత్రం పట్ల ఎందుకు వివక్ష చూపారో తెలియదని, ది కాశ్మీర్ ఫైల్స్ ఒక ముఖ్యమైన చిత్రం అయితే, ఝుండ్ తక్కువ కాదని ఆమె అన్నారు. “నేను ఇటీవల కశ్మీర్ ఫైల్స్‌ని చూశాను. కశ్మీరీ పండిట్ల కథ హృదయ విదారకంగా ఉంది. ఇది చెప్పాల్సిన కథ. కానీ JHUND నిర్మాతగా నేను… మా చిత్రం కూడా అద్భుతమైంది. ఝుండ్ కథ సందేశంతో కూడి కుంది. ఎంతోమంది ప్రశంసలు అందుకుంది. అని సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యారు.