Thangalaan:చియాన్ విక్రమ్‌కి (Vikram) తెలుగులోనూ ఫాన్స్ ఎక్కువే..! ఆయన నటనని, వైవిధ్యమైన కథలని, తెలుగు ఆడియన్స్ “అపరిచితుడు” (Aparichithudu) కంటే ముందు నుంచే.. ఆదరిస్తూ వస్తున్నారు. ఈ మధ్య కాలంలో సరైన హిట్టు లేని విక్రమ్… మరో డిఫ్రెంట్ గేటప్‌తో (Different Getup) మన ముందుకు వస్తున్నారు. అదే తంగలాన్.! (Thangalaan) ఈ సినిమాలో స్పెషల్ ఏంటి… ఈ మూవీ మీద ఎందుకంత నమ్మకం అంటే.. చాలా మంది చెప్తున్న పేరు డైరెక్టర్ పా.రంజిత్ (Director Ranjith).
అణగారిన బతుకుల మీద సినిమాలు తీయడంలో.. తమిళ దర్శకులకి (Tamil Director) మంచి పట్టు ఉంది అనే చెప్పాలి. అందులోనూ పా. రంజిత్ ది (Pa Ranjith) ఒక సెపరేట్ రూట్. మొదటి సినిమా “అట్టకత్తి” (Attakathi) నుంచే డైరెక్టర్ అభిరుచి ఏంటి అని అర్ధం అవుతుంది. రెండో సినిమాగా హీరో కార్తీ తో “మద్రాస్” (MAdras) అనే సినిమా తీశారు ఈ డైరెక్టర్. చెన్నైలో ఉండే రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా.. మంచి హిట్టు అందుకోగా, రంజిత్ ని “సూపర్ స్టార్ రజనీకాంత్” (Super Star) కి దగ్గర చేసింది కూడా ఈ సినిమానే.
తలైవా తో “కబాలి” (Kabali )సినిమా తీయగా ఆ సినిమా క్రియేట్ చేసిన హడావిడి అంత ఇంత కాదు. రిలీజ్ రోజు ఏకంగా కొన్ని కార్పొరేట్ కంపెనీలు సెలవు దినం (Holiday) ప్రకటించాయి. విమానాలు (Flights) మీద కూడా అప్పట్లో కబాలి పోస్టర్స్ (Posters) అంటించి ప్రమోషన్స్ చేసారు. భారీ అంచనాల నడుమ రజనీకాంత్ (Rajinikanth) డిఫ్రెంట్ లుక్‌తో మెరిసిన ఈ సినిమా… స్లోగా నడవటంతో థియేటర్‌లో ఫ్లాప్‌గా (Flop) నిలిచింది. కానీ సూపర్ స్టార్, రంజిత్ కి మరో అవకాశం ఇచ్చారు. ఈ సారి “కాలా” (Kala) తో పర్లేదు అనిపించుకున్నారు. ఊహించిన మేర సక్సస్ అవ్వకపోయినా… రజిని వయసుకు తగ్గ సినిమాలుగా నిలిచాయి కబాలి (Kabali), కాలా(kala)..! ఈ సినిమాలకి సపరేట్ ఫ్యాన్ బేస్ (Seperate Fan Base) కూడా ఉంది.
తర్వాత ఆర్యతో “సార్పట్టా పరంపర” సినిమా తెరకెక్కించగా కరోనా కారణంగా ఈ సినిమా కేవలం… ఓటీటీ లోనే రిలీజ్ చేసారు. బాక్సింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా… సూపర్ హిట్ గా నిలించింది. పా. రంజిత్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. తర్వాత నెట్‌ఫ్లిక్స్ [Netflix] కి ఒక యూత్ ఫుల్ పిక్చర్ కూడా చేసారీ డైరెక్టర్. అయితే ఓటీటీ సూపర్ హిట్ తర్వాత రంజిత్, చియాన్ కాంబినేషన్‌లో వస్తున్న తంగలాన్ పైన.. అంచనాలు భారీగానే ఉన్నాయి. స్వాతంత్ర్యం రాకముందు కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ [KGF] నేపథ్యంలో తెరకెక్కిన కథ ఇది. స్టూడియో గ్రీన్ నిర్మించిన ఈ చిత్రానికి, జి.వి ప్రకాష్ సంగీతం అందించారు. స్వతంత్ర్య దినోత్సవం.. సందర్భంగా ఆగష్టు 15 న ఈ సినిమా రిలీజ్ అవుతుంది.