Ram Charan & Upasana: పిల్లలపై ఉపాసన, రాంచరణ్ క్లారిటీ.. అసలు రీజన్ ఇదే!

టాలీవుడ్ అందమైన జంటల్లో రామ్ చరణ్, ఉపాసన జంట ఒకటి.

Published By: HashtagU Telugu Desk
Ramcharan

Ramcharan

టాలీవుడ్ అందమైన జంటల్లో రామ్ చరణ్, ఉపాసన జంట ఒకటి. 2012లో పెళ్లి చేసుకున్న ఈ జంట ఇటీవల పదేళ్ల వైవాహిక బంధం పూర్తి చేసుకుంది. అయితే పెళ్లై పదేళ్లయినా నేటికీ ఈ జంటకు పిల్లలు లేకపోవడంతో హాట్ టాపిక్ గా మారుతుంది. ఇప్పటికీ పిల్లలు లేకపోవడంతో అటు ఉపానసపై , ఇటు రాంచరణ్ పై రుమార్స్ వచ్చాయి. ఈ విషయమై మీడియా పలు సందర్భంగా ఈ జంటను ప్రశ్నించగా.. మాకు ఇప్పట్లో పిల్లలపై ఆసక్తి లేదనీ, మా కెరీర్ పై ఫోకస్ పెట్టామని స్పష్టం చేశారు. ఇటీవల ఉపాసన సద్గురుని కలిసి, జనాభా నియంత్రణ కోసం తనకు పిల్లలు వద్దు అని చెప్పింది.

ఇంటరాక్షన్ సమయంలో ఉపాసన తన జీవితంలోని ముగ్గురు (RRR ) గురించి రిలేషన్, పునరుత్పత్తి, ప్యూచర్ ఫ్లాన్స్ గురించి మాట్లాడింది. ఉపాసన మాటలకు సద్గురు రియాక్ట్ అవుతూ.. ‘‘జనాభా తగ్గితే గ్లోబల్ వార్మింగ్ గురించి కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాబట్టి, పునరుత్పత్తి చేయకూడదని నిర్ణయించుకున్న మహిళలను గౌరవించాలి’’ అని బదులిచ్చారు.  “మెగా స్టార్ చిరంజీవి కొడుకుగా, అభిమానులను సంతోషపెట్టే బాధ్యత నాపై ఉంది. నేను ఫ్యామిలీ, పిల్లలపై ఫోకస్ చేస్తే.. నా లక్ష్యం నెరవేరదు. ఉపాసనకు కూడా కొన్ని లక్ష్యాలున్నాయి. అందుకే కొన్నాళ్ల పాటు పిల్లలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాం’’ అని రాం చరణ్ స్పష్టం చేశాడు.

  Last Updated: 09 Jul 2022, 03:19 PM IST