Deepika Padukone : వేర్ ఈజ్ దీపికా.. కల్కిలో ఆమె ఉందా లేదా..?

Deepika Padukone ప్రభాస్ లీడ్ రోల్ లో నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా కల్కి. కల్కి సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా కల్కి 2898 AD

  • Written By:
  • Publish Date - June 7, 2024 / 07:03 PM IST

Deepika Padukone ప్రభాస్ లీడ్ రోల్ లో నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా కల్కి. కల్కి సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా కల్కి 2898 AD సినిమా జూన్ 27న రిలీజ్ అవుతుంది. ప్రభాస్ సరసన దీపిక పదుకొనె ఫిమేల్ లీడ్ గా నటిస్తున్న ఈ సినిమాలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటాని కూడా నటిస్తున్నారని తెలిసిందే. ఐతే సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న దీపిక ఇప్పటివరకు సినిమా గురించి ఎక్కడ నోరు విప్పలేదు. కల్కి రిలీజ్ మరో 20 రోజులే ఉన్నా సినిమా ప్రమోషన్స్ లో కూడా దీపిక కనిపించట్లేదు.

కల్కి నుంచి భైరవ బుజ్జిలను పరిచయం చేస్తూ హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ఈవెంట్ కి దీపిక అటెండ్ అవ్వలేదు. కల్కి సినిమాలో దీపిక్ అసలు ఉందా లేదా అని డౌట్ పడేలా చేస్తుంది అమ్మడు. ఐతే దీపిక ప్రస్తుతం ప్రగ్నన్సీతో ఉంది. రీసెంట్ గా బయట కనిపించిన ఆమె బేబీ బంప్ తో దర్శనమిచ్చింది. ఆ కారణంతోనే దీపిక కల్కి ప్రమోషన్స్ కి దూరంగా ఉంటుందని అంటున్నారు.

కల్కి టీం ముంబై, ఢిల్లీ రెండు చోట్ల భారీ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారట. ఈ ఈవెంట్ కి అయినా దీపిక వస్తుందా లేదా అన్నది సస్పెన్స్ గా ఉంది. ఈవెంట్ కి రాకపోయినా కనీసం ఒక వీడియో మెసేజ్ అయినా పంపించవచ్చు కదా అని అనుకుంటున్నారు. మరి కల్కి టీం ఈ విషయంలో దీపికని ఎందుకు లైట్ తీసుకున్నారన్నది తెలియాల్సి ఉంది.