Site icon HashtagU Telugu

Chiranjeevi : చిరంజీవి బాలీవుడ్ సినిమాలు చేయకపోవడానికి కారణం ఇదే..

Why Chiranjeevi didn't do Bollywood movies

Why Chiranjeevi didn't do Bollywood movies

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) తన యాక్టింగ్‌తో, ఫైట్స్ అండ్ డాన్సులతో ఎంతో ఫేమ్ ని సంపాదించుకున్నారు. తన సినిమాలతో ప్రభంజనం సృష్టించి ‘బిగ్గెర్ దెన్ బచ్చన్’ అని అనిపించుకున్నారు బాలీవుడ్(Bollywood) లో. బాలచందర్ వంటి గ్రేట్ డైరెక్టర్ చిరంజీవి గురించి మాట్లాడుతూ.. ‘శివాజీ గణేశన్, రజినీకాంత్, కమల్ హాసన్ కలిపితే చిరంజీవి’ అంటూ తన నటనని పొగిడారు. అలాంటి చిరంజీవి కేవలం తెలుగులోనే పరిమితం అయ్యారు. రజినీకాంత్, కమల్ హాసన్ ఇతర భాషల్లో కూడా నటించి నేషనల్ వైడ్ పాపులారిటీని సంపాదించుకున్నారు.

కానీ చిరంజీవి మాత్రం తెలుగులోనే నటిస్తూ వచ్చారు. అప్పటిలో బాలీవుడ్ లో మూడు సినిమాలు చేసి సక్సెస్ అందుకున్నా.. ఆ తరువాత మళ్ళీ హిందీ సినిమాల్లో కనిపించలేదు. చిరంజీవి ఎందుకు బాలీవుడ్ లో కొనసాగలేదని చాలామందిలో ఒక సందేహం ఉంది. దానికి జవాబు కూడా చిరంజీవి ఒక సందర్భంలో తెలియజేశారు. 1990లో తెరకెక్కిన ‘ప్రతిబంధ్’ సినిమాతో చిరంజీవి బాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత తన గ్యాంగ్ లీడర్ మూవీని, తమిళ్ ‘జెంటిల్ మెన్’ చిత్రాన్ని రీమేక్ చేశారు. ఈ సినిమా తరువాత చిరంజీవి మళ్ళీ బాలీవుడ్ మూవీ చేయలేదు.

అందుకు కారణం చిరంజీవి ఒక ఇంటర్వ్యూలో చెబుతూ.. ప్రతిబంధ్ తరువాత చాలా ఆఫర్స్ వచ్చాయట. అప్పటి బాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ ప్రకాశ్‌ మెహ్రా, మనోహన్‌ దేశాయ్‌, రాజ్ సిద్ది, సజిత్ నదియావాలా.. చిరంజీవికి కథలు వినిపించారట. కానీ అవి ఏవి నచ్చకపోవడంతో రిజెక్ట్ చేశారట. తనకి మంచి కథలు దొరకపోవడం వలనే బాలీవుడ్ సినిమాల్లో కనిపించలేకపోతున్నట్లు వెల్లడించారు. ఇక చిరంజీవి వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ కూడా కెరీర్ మొదటిలో ‘జంజీర్’ అనే బాలీవుడ్ సినిమా చేశారు. ఆ మూవీ ప్లాప్ అవ్వడంతో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే RRRతో ఆ విమర్శలు అన్నిటికి బదులిచ్చారు. ప్రస్తుతం బాలీవుడ్ లో చరణ్ కి మంచి క్రేజ్ ఉన్నా.. ఇంకా హిందీ సినిమాలకు సైన్ చేయకుండానే వస్తున్నారు.

 

Also Read : Pushpa jagadeesh: యువతి ఆత్మహత్య కేసు.. తన నేరం అంగీకరించిన “పుష్ప” జగధీశ్