Site icon HashtagU Telugu

Venkatesh Saindhav : వెంకటేష్ సైంధవ్ ని అందుకే ఎవరు పట్టించుకోలేదా..?

Venkatesh Saindhav OTT Release Update

Venkatesh Saindhav OTT Release Update

Venkatesh Saindhav విక్టరీ వెంకటేష్ శైలేష్ కొలను కాంబినేషన్ లో తెరకెక్కిన సైంధవ్ సినిమా సంక్రాంతి సీజన్ లో వచ్చి నిరాశపరిచింది. రిలీజ్ కు ముందు వెంకటేష్ చేసిన బీభత్సమైన పబ్లిసిటీ సినిమాకు ఏమాత్రం కలిసి రాలేదు. వెంకటేష్ నుంచి వచ్చిన భారీ యాక్షన్ మూవీగా సైంధవ్ మీద ఆడియన్స్ అంత గురి పెట్టలేదు. అయితే చూసిన కొంతమంది ఆడియన్స్ కూడా సినిమాలో యాక్షన్ పాళ్లు తప్ప ఎమోషన్స్ ఏవి వర్క్ అవుట్ అవ్వలేదని చెప్పారు. ఆ టాకే రిజల్ట్ ని కూడా డిసైడ్ చేసింది.

We’re now on WhatsApp : Click to Join

వెంకటేష్ నుంచి చాలా కాలం తర్వాత వచ్చిన సైంధవ్ సినిమాను ఎవరు పట్టించుకోలేదు. వెంకటేష్ సారాల మధ్య ఎమోషనల్ కంటెంట్ తో సినిమా వచ్చినా కోర్ కాన్సెప్ట్ కి ఎంచుకున్న యాక్షన్ బ్యాక్ డ్రాప్ కి అసలు పొంతన కుదరలేదని.. అందుకే ఆ యాక్షన్ ని ఆడియన్స్ భరించలేక సినిమాను చూడలేదని అంటున్నారు. శైలేష్ కొలను న్యూ ఏజ్ యాక్షన్ చూపించాలని అనుకున్న ఆలోచన బాగున్నా వెంకటేష్ లాంటి ఫ్యామిలీ హీరో నుంచి ఈ రేంజ్ విధ్వంసం ఆశించలేదు.

అదీగాక సంక్రాంతికి ఫ్యామిలీ అంతా కలిసి సరదాగా చూసే సినిమా చూడాలని అనుకుంటారు కానీ వెంకటేష్ సైంధవ్ లో యాక్షన్ తప్ప ఎమోషనల్ కంటెంట్ కూడా మిస్ అవ్వడంతో ప్రేక్షకులు పెదవి విరిచారు. పోటీగా వచ్చిన గుంటూరు కారం త్రివిక్రం మార్క్ లేకున్నా మహేష్ మాక్సిమం లాక్కొచ్చేశాడు. ఇక హనుమాన్ సంగతి తెలిసిందే.

సైంధవ్ తర్వాత రోజు రిలీజైన నాగార్జున నా సామిరంగ కూడా బాగానే వర్క్ అవుట్ అయ్యింది. నాగార్జునకి చాలా రోజుల తర్వాత సూపర్ హిట్ జోష్ ఇచ్చింది నా సామిరంగ. ఎటొచ్చి వెంకటేష్ సైంధవ్ సినిమానే ఆడియన్స్ అంతగా పట్టించుకోలేదు. సినిమాకు వచ్చిన బ్యాడ్ రివ్యూస్ ని డైరెక్టర్ శైలేష్ కొలను ఏకేసినా సరే వెంకటేష్ నుంచి ఈ రేంజ్ యాక్షన్ మూవీ ఆశించిన దగ్గుబాటి ఫ్యాన్స్ కూడా సైంధవ్ సినిమాకు ఓటేయ్యలేదు.

Also Read : Ravi Teja: ర‌వితేజ స్మార్ట్‌ ఎస్కేప్‌.. సంక్రాంతికి నుంచి అందుకే త‌ప్పుకున్నాడు

వెంకటేష్ సైంధవ్ టార్గెట్ మిస్ అవ్వడంతో నెక్స్ట్ సినిమాను నెక్స్ట్ లెవెల్ లో చేయాలని ఫిక్స్ అయ్యారని తెలుస్తుంది. వెంకటేష్ 75వ మైల్ స్టోన్ మూవీగా వచ్చిన సైంధవ్ ఈ రేంజ్ ఫెయిల్యూర్ అందుకోవడం ఫ్యాన్స్ ని కాస్త ఇబ్బంది పెడుతున్నా నెక్స్ట్ వెంకీ మార్క్ ఎంటర్టైనర్ తో వస్తే కచ్చితంగా దీనికి డబుల్ రెస్పాన్స్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. వెంకటేష్ తన నెక్స్ట్ డైరెక్టర్స్ లిస్ట్ లో తరుణ్ భాస్కర్, త్రివిక్రం ఉన్నట్టు తెలుస్తుంది.