Site icon HashtagU Telugu

Divyavani: సినిమా వాళ్లంటే చులకన దేనికి ?: నటి దివ్యవాణి

Divyavani

Divyavani

దివ్యవాణి (Divyavani) పేరు వినగానే.. బాపు బొమ్మ అనే మాట ప్రాణం పోసినట్టుగా.. ‘పెళ్లి పుస్తకం’లోని పాట గుర్తుకు వస్తుంది. బాపు బొమ్మ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది తానేనని ఆమె గర్వంగా చెబుతుంటారు. అలాంటి దివ్యవాణి (Divyavani) రాజకీయాలలోను తన దూకుడు చూపించారు. ఇంటర్వ్యూలో ఆమె అనేక విషయాలను అభిమానులతో పంచుకున్నారు.

“రాజకీయాలలోకి వెళ్లిన సినిమా వాళ్లకు ఎంతమాత్రం అక్కడ విలువ ఇవ్వడం లేదు. సినిమా వాళ్లంటే జనంలోను గౌరవం తగ్గుతూ వస్తోంది. సినిమాల నుంచి ఒక కేటగిరి వారు బయటికి రావడం ఇందుకు కారణమవుతోంది. ఎన్టీఆర్ .. సావిత్రి వంటి వారినీ ఇప్పటికీ ఎంతో గౌరవిస్తున్నారు. కానీ కొంతమంది వ్యక్తుల కారణంగా ఇప్పుడు సినిమాల వాళ్లను అందరూ చులకనగా చూస్తున్నారు” అన్నారు.

“నేను సినిమా రంగం నుంచి వచ్చాను .. అందువలన సినిమా వాళ్లను ఏదైనా అంటే నాకు చాలా బాధ కలుగుతుంది. అన్ని రంగాల్లో మాదిరిగానే ఇక్కడ కూడా మంచీ చెడు రెండూ ఉన్నాయి. ఇక నా భర్త నుంచి నేను విడిపోయినట్టుగా ప్రచారం జరుగుతోంది .. కానీ అలాంటిదేం లేదు. సినిమాలు .. రాజకీయాలు .. ఇలా అన్ని విషయాల్లోను ఆయన నాకు మంచి సలహాలు .. సూచనలు ఇస్తుంటారు” అంటూ చెప్పుకొచ్చారు.

Also Read:  Hepatitis B: సెక్స్ వల్ల కూడా “హెపటైటిస్ బి” వస్తుందా?

Exit mobile version