Anushka స్వీటీ అనుష్క సినిమాలు రెగ్యులర్ గా చేయకపోయినా ఈమధ్య సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది. అనుష్క ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్ లో సినిమా చేస్తుంది. ఆ సినిమా కూడా తన మార్క్ ఫిమేల్ సెంట్రిక్ ప్రాజెక్ట్ గా సత్తా చాటడానికి వస్తుందని తెలుస్తుంది. ఈ సినిమాతో పాటుగా మలయాళంలో కూడా ఒక క్రేజీ మూవీ చేస్తుంది అనుష్క. ఐతే తెలుగులో క్రిష్ సినిమా కాకుండా మరో ప్రాజెక్ట్ కు సైన్ చేయలేదు అమ్మడు.
ఓ పక్క స్వీటీ ఫ్యాన్స్ మాత్రం ఆమె వరుస సినిమాలు చేస్తే చూడాలని అనుకుంటున్నారు. ఇదిలాఉంటే సోషల్ మీడియాలో అదే అనుష్క తన ఇన్ స్టాగ్రాం లో దేవసేన (Devasena) ఫోటో షేర్ చేసింది. దానికి ఎలాంటి కామెంట్ పెట్టకుండా జస్ట్ ఫోటో మాత్రమే షేర్ చేసింది అనుష్క. ఈ ఫోటో షేర్ చేయడం వెనక రీజన్ ఏంటని ఆడియన్స్ మైండ్ కి పనిచెబుతున్నారు.
Also Read : Thalapathy Vijay : స్టార్ సినిమాపై రిలీజ్ డౌట్లు అక్కర్లేదు..!
బాహుబలి సినిమాలో ప్రభాస్ కు జంటగా దేవసేనగా నటించిన అనుష్క ఆ సినిమాతో మరోసారి తన నటన ప్రతిభ చాటింది. ప్రభాస్ (Prabhas), అనుష్క స్క్రీన్ మీద కనిపిస్తేనే అదో రేంజ్ అని ఫీల్ అవుతారు ఆడియన్స్. ఐతే మళ్లీ అనుష్క ప్రభాస్ తో ఏదైనా సినిమా చేస్తుందా అందుకే ఆమె ఈ హింట్ ఇచ్చిందా అన్నట్టుగా అంచనా వేస్తున్నారు ఆడియన్స్.
అనుష్క ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ లాస్ట్ ఇయర్ మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాలో నటించింది. ఈ సినిమా తర్వాత క్రిష్ డైరెక్షన్ లో మూవీ చేస్తుంది. ఐతే ఇక మీదట వరుస సినిమాలు చేయాలని చూస్తుంది అమ్మడు. అనుష్క అసలు ఏం చేసినా వైరల్ అవుతుంది. అలాంటిది అమ్మడు దేవసేన పోస్ట్ ని షేర్ చేసే సరికి కొత్త ఊహాగానాలకు ఛాన్స్ ఇచ్చినట్టు అయ్యింది. ఐతే ఇంతకీ అనుష్క ఎందుకు దేవసేన ఫోటో షేర్ చేసింది అన్నది మాత్రం తెలియలేదు.