Site icon HashtagU Telugu

Kannappa : కన్నప్పలో పార్వతిదేవి ఎవరు.. ఆ ఇద్దరిలో ముందు ఆమె అన్నారు కానీ ఇప్పుడు మాత్రం..!

Whos is Parvathi Devi in Kannappa Manchu Vishnu Prabhas

Whos is Parvathi Devi in Kannappa Manchu Vishnu Prabhas

Kannappa మంచు విష్ణు లీడ్ రోల్ లో స్వీయ నిర్మాణంలో చేస్తున్న భారీ ప్రాజెక్ట్ కన్నప్ప. ఈ సినిమాను ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నారు. 100 కోట్ల పైన బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ కూడా భాగం అవుతున్నాడని తెలిసిందే. కన్నప్ప సినిమాలో ప్రభాస్ శివుడిగా కనిపించనున్నారట. అయితే ప్రభాస్ శివుడైతే పార్వతి పాత్ర ఎవరు చేస్తారనే ఆసక్తి మొదలైంది.

కన్నప్ప సినిమాలో ప్రభాస్ శివుడిగా చేస్తుండాగా పార్వతి దేవి పాత్రలో ముందు నయనతారని తీసుకున్నారని వార్తలు వచ్చాయి. కానీ లేటెస్ట్ గా ఆ పాత్ర కోసం బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కంగనా రనౌత్ ని సెలెక్ట్ చేసినట్టు తెల్సుతుంది. తెలుగులో కంగనా రనౌత్ ఒకే ఒక్క సినిమా చేసింది. అది కూడా ప్రభాస్ తోనే నటించింది.

ప్రభాస్ పూరీ జగన్నాథ్ కాంబోలో వచ్చిన ఏక్ నిరంజన్ సినిమాలో కంగనా రనౌత్ నటించింది. ఆ తర్వాత ఇన్నాళ్లకు మళ్లీ కన్నప్పలో ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. కన్నప్ప సినిమాను మంచు విష్ణు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను ఈ ఇయర్ దసరాకి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.

Also Read : Mahesh Thank you Boss : మహేష్ థాంక్ యు బాస్ చెబుతున్నాడు.. సూపర్ స్టార్ క్రేజ్ కి ఇది నిదర్శనం..!