Site icon HashtagU Telugu

Samantha Dating: మీలాగా నన్ను ఎవరు ప్రేమిస్తారు.. డేటింగ్ పై సమంత కామెంట్స్

Samantha

Samantha

టాలీవుడ్ నటి సమంత (Samantha) నాగచైతన్యతో విడిపోయి కొన్ని నెలలు గడిచిపోయినప్పటికీ ఆమె రిలేషన్ పై సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. సమంత రెండో పెళ్లి చేసుకోబోతోందా? సమంత పలానా వ్యక్తితో డేటింగ్ (Dating) చేస్తుంది? అనే రూమర్స్ చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. అయితే తాజాగా ట్విటర్‌లో సమంతను ఓ అభిమాని వెరైటీ ప్రశ్న అడిగాడు.

‘ఇలా అడగడం సమంజసం కాదని తెలుసు. కానీ మీరు ఎవరితోనైనా డేట్ చేయండి’ అని చెప్పగా, ‘నన్ను మీలాగా ఎవరు ప్రేమిస్తారు’ అంటూ రిప్లయ్ ఇచ్చిన సామ్ బదులిచ్చింది.  అయితే ఉంటే, భర్త నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత సమంత (Samantha) ఒంటరిగా ఉంటోంది. ఇదే క్రమంలో మయోసైటిస్ వ్యాధికి గురై చాలా రోజులు ఇంటికే పరిమితమైంది.  చాలా రోజుల తర్వాత సెట్స్ లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం సామ్ సమాధానం నెటిజన్స్ ను ఆకట్టుకుంది.

ఇక ఇటీవలనే యశోద మూవీతో ఆకట్టుకున్న సమంత (Samantha), ‘శాకుంతలం’ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గుణశేఖర్ డైరెక్షన్ చేసిన ఈ మూవీలో సమంత శకుంతల దేవిగా టైటిల్ రోల్ పోషించింది. ఆమెకు జంటగా దుష్యంతుడి పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ నటించారు. అల్లు అర్జున్ కూతురు అర్హ.. సిల్వర్ స్క్రీన్‌కు ఎంట్రీ ఇవ్వబోతోంది.

Also Read: Keerthy Suresh: వెన్నెల అందరికి కనెక్ట్ అయ్యే పాత్ర.. నా కెరీర్‌లో మోస్ట్ ఛాలెంజింగ్: కీర్తి సురేష్

Exit mobile version