Site icon HashtagU Telugu

Animal Lover: జంతు ప్రేమికుడిగా మారిన రౌడీ హీరో.. ఎవరంటే?

Vijay 23

Vijay 23

Animal Lover: తనదైన యువ ఉత్సాహంతో యువతను ఉర్రుతలూగించాడు విజయ్ దేవరకొండ. యువ కెరటంగా ఎగిసి యువతీ యువకుల హృదయాలను కొల్లగొట్టాడు విజయ్. అభిమానులు తనను రౌడీ బాయ్ గా, ఇక అమ్మాయిలైతే లవర్ బాయ్ గా విజయ్ దేవరకొండను అభిమానిస్తారు. అలా తనదైన ముద్ర వేసి అభిమానగణాన్ని సంపాదించుకున్నాడు ఈ వరల్డ్ ఫేమస్ లవర్. ప్రస్తుతం ఈ రౌడీ బాయ్ కి సంబంధించిన ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

సాధారణంగా షూటింగ్‌ విరామ సమయాల్లో, లేదా ఎప్పుడు ఖాళీ దొరికినా.. సరదాగా విహారయాత్రకు వెళ్లడం విజయ్ కి అలవాటు. అలా యాత్రలకు వెళ్తూ, ఆ విశేషాలను, ఆ ఫొటోలను అభిమానులతో పంచుకుంటుటాడు. ఇక తాజాగా విజయ్‌ తన కుటుంబంతో కలిసి దుబాయ్‌ ట్రిప్‌కు వెళ్లారు. అక్కడ ఉన్న జంతువులతో సరదాగా గడిపారు. ఈ యాత్రకు సంబంధించిన విషయాలను, కొన్ని వీడియోలను విజయ్‌ తన సోషల్‌మీడియాలో షేర్ చేశాడు.

దుబాయ్ యాత్ర విశేషాలకు సంబంధించి ఒక వీడియోను తన ఇన్ స్టా లో పంచుకున్నాడు విజయ్. దానిలో “ఒక అందమైన ఉద్యానవనం, జంతువులను సంతోషంగా చూసుకునేవారు, గొప్ప సంరక్షకులు.. వారు నాకు ఉన్న పెద్ద భయాన్ని పోగొట్టారు. పాములు, జంతువులపై చాలా జ్ఞానాన్ని పంచుకున్నారు మరియు నన్ను అందమైన సింహం మరియు పులి పిల్లలతో ఆడుకోవడానికి అవకాశం ఇచ్చారు.” అని రాసుకొచ్చాడు. ఇక ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోకు కామెంట్స్ మాములుగా లేవు.

ఇక అభిమానులు దీనికి “ఇది విహార యాత్ర కాదు.. సాహస యాత్ర” అంటూ, “జాగ్రత్త అన్న” అని ఒకరు.. “నిజంగానే రౌడీ హీరోవి నువ్వు” అని మరొకరు కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ విషయాలు ఇలా ఉంటే.. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ, సమంత తో కలిసి “ఖుషి” సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ 60 శాతం వరకు అయిపోయింది. ఇది కాకుండా.. పరశురామ్‌ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు.