Site icon HashtagU Telugu

Tollywood: టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ ఎవరో మీకు తెలుసా?

Mixcollage 12 Mar 2024 02 34 Pm 6586

Mixcollage 12 Mar 2024 02 34 Pm 6586

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్ అనగానే చాలామంది ఆలోచనలో పడుతూ ఉంటారు. ఎందుకంటే ఈ విషయంలో ఒకరు ఒక్కొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. వారికి నచ్చిన హీరోయిన్ నెంబర్ వన్ హీరోయిన్ గా చెప్పుకుంటూ ఉంటారు అభిమానులు. మరి ఇంతకీ టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ ఎవరు ఆ తర్వాత స్థానాల్లో ఎవరెవరు ఉన్నారు అన్న వివరాల్లోకి వెళితే.. అయితే నిన్నటి వరకు నెం 1 అనుకున్న శ్రీలీలకు ఇప్పుడు సినిమాలే లేవు. పవన్, విజయ్ దేవరకొండ సినిమాలు ఉన్నా ఇప్పట్లో మొదలు కావు.

మరోవైపు మృణాళ్ ఠాకూర్‌ను రెండు హిట్లకే టాప్ హీరోయిన్స్ లిస్టులో చేర్చలేం. శ్రీలీల, మృణాళ్ సంగతి పక్కనబెడితే, మీనాక్షి చౌదరి దూకుడు తెలుగులో బాగా కనిపిస్తోంది. దుల్కర్ సల్మాన్, విశ్వక్ సేన్, వెంకటేష్ లాంటి హీరోలతో నటిస్తోంది మీనాక్షి చౌదరి. రెండేళ్ళ కింది వరకు టాలీవుడ్‌ను దున్నేసిన పూజా హెగ్డేకు ఇప్పుడు ఆఫర్స్ లేవు. మరోవైపు రష్మిక మందన్న టాలీవుడ్‌కు గ్యాప్ ఇచ్చి బాలీవుడ్‌పై ఫోకస్ చేసారు. పుష్ప 2 ఒక్కడే రష్మిక చేస్తున్న పెద్ద సినిమా. సమంత, తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్ వీళ్ళంతా సీనియర్స్ కావడంతో ఆఫర్స్ తగ్గిపోయాయి. మరోవైపు శ్రీలీల, కృతి శెట్టి ఫ్లాపుల్లో ఉన్నారు.

ఈ గ్యాప్ భర్తీ చేయడానికి జాన్వీ కపూర్ వస్తున్నారు. చరణ్, ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమాల్లో ఈమె హీరోయిన్. అయితే అవి వచ్చేవరకు జాన్వీ రేస్‌లో లేనట్లే. ఈ లెక్కన టాలీవుడ్‌లో నెంబర్ వన్ హీరోయిన్ పీఠం మరికొన్ని రోజులు ఖాళీగా ఉండాల్సిందే. కానీ ప్రస్తుతానికి మాత్రం టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ అంటే మీనాక్షి చౌదరి పేరే వినిపిస్తోంది..