సమంత (Samantha), బాలీవుడ్ నటుడు వరుణ్ ధవన్ (Varun Dhavan) కాంబినేషన్లో వస్తున్న ‘సిటాడెల్: హనీ-బన్నీ’ (Citadel Honey Bunny) వెబ్ సిరీస్ పై ఎంతో ఆసక్తి నెలకొంది. నవంబరు 07 నుండి అమెజాన్ ప్రైమ్ లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో సమంత..మేకర్స్ తో కలిసి దేశ వ్యాప్తంగా ప్రమోషన్ చేస్తూ బిజీ గా మారింది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూల్లో సదరు యాంకర్..రెండో పెళ్లిపై ప్రశ్న అడిగారు. దానికి సామ్ ఏమాత్రం చిరాకు పడకుండా సమాధానం ఇచ్చింది. తాను ఎంతో ఇష్టపడి, ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకున్నానని, ప్రస్తుతం విడిపోయామని, తన జీవితంలో ఇక రెండో పెళ్లి అనే ప్రసక్తి కానీ, మరో వ్యక్తికానీ ఎవరూ ఉండరని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేసింది.
తాజాగా మరో ఇంటర్వ్యూ లో సదరు యాంకర్ ప్రస్తుతం మీరు ఎవరితోనైనా రిలేషన్ లో ఉన్నారా? అని అడగ్గా.. త్వరలో మీరే చూస్తారుగా అంటూ సామ్ బదులిచ్చింది. దీంతో అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలో మరో వ్యక్తికి స్థానం లేదని, రెండో వివాహంపై ఆసక్తి లేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది. ఇప్పుడు ఊహించనిరీతిలో ఇలా సమాధానం ఇచ్చింది ఏంటి అని అంత మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. కొంతకాలం నుంచి సమంత బాలీవుడ్ కు చెందిన ఓ యువ కథానాయకుడితో ఎంతో సన్నిహితంగా ఉంటోందని, ముంబయి వెళ్లినప్పుడల్లా అతని ఇంట్లోనే ఉంటోందని వార్తలు వస్తున్నాయి. మరి అతడితోనే రిలేషన్ లో ఉందా..? లేక మరొకరితో ఉందా..? అనేది క్లారిటీ రావాల్సి ఉంది.
Read Also : Kidney Problems : మూత్రపిండాల సమస్యలు స్ట్రోక్స్ ప్రమాదాన్ని ఎలా పెంచుతాయి