గ్లోబల్ స్టార్ రాం చరణ్ (Ram Charan) నటించిన గేమ్ ఛేంజర్ సినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది. సంక్రాంతికి మాస్ అంశాలతో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా గేమ్ ఛేంజర్ వస్తుంది. శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ తో కియరా అద్వాని జత కట్టింది. సినిమాకు థమన్ అందించిన మ్యూజిక్ కూడా సినిమాకు హైలెట్ అయ్యేలా ఉంది. గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ హంగామా ఇప్పటికే మొదలైంది. సినిమా మొదటి ఈవెంట్ డల్లాస్ లో చేస్తున్నారు.
ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీగా ప్లాన్ చేస్తున్నారు. గేమ్ ఛేంజర్ (Game Changer) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ ఎవరన్నది ఎగ్జైటింగ్ గా ఉంది. కొందరు మెగాస్టార్ చిరంజీవి వస్తారని అంటుంటే మరికొందరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా వస్తారని అంటున్నారు. గేమ్ ఛేంజర్ కు మెగాస్టార్ Chiranjeevi, పవర్ స్టార్ Pawan Kalyan ఎవరొచ్చినా సినిమా ని మరింత ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లినట్టు అవుతుంది.
ఇప్పటికే మెగా ఫ్యాన్స్ అంతా ఈ సినిమాను ఓన్ చేసుకున్నారు. గేమ్ ఛేంజర్ సినిమాతో భారీ టార్గెట్ నే పెట్టుకున్నాడు చరణ్. ఈ సినిమాతో మరోసారి తన బాక్సాఫీస్ స్టామినా ఏంటన్నది చూపించబోతున్నాడు. ఈ సినిమా విషయంలో మేకర్స్ కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. గేమ్ ఛేంజర్ సినిమాతో చరణ్ భారీ టార్గెట్ పెట్టుకున్నాడు. ఆర్.ఆర్.ఆర్ తో 1000 కోట్లు కలెక్ట్ చేసిన చరణ్ ఈసారి సోలోగా ఆ మార్క్ అందుకోవాలని చూస్తున్నాడు. మరి సినిమా ఆ రేంజ్ ఉంటుందా లేదా అన్నది చూడాలి.
Also Read : Alia Bhatt : అలియా భట్ ఎక్కడా తగ్గట్లేదు..!